Honor 200 Lite 5G : మార్కెట్ లోకి ఆనర్‌ 200 లైట్‌5జీ మొబైల్

Update: 2024-09-20 11:30 GMT

ప్రముఖ చైనా మొబైల్‌ తయారీ కంపెనీ ఆనర్‌ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆనర్‌ 200 లైట్‌ 5జీ పేరిట దీన్ని లాంచ్‌ చేసింది. 108ఎంపీ కెమెరా, ఏఐ ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది. ఆనర్‌ కొత్త మొబైల్‌ ఒకే వేరియంట్‌లో మాత్రమే అందుబాటు ఉంది. 8జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధర రూ.17,999గా కంపెనీ నిర్ణయించింది. సియాన్‌ లేక్‌, మిడ్‌నైట్‌ బ్లూ, స్టేరీ బ్లాక్‌.. రంగుల్లో లభిస్తుంది. సెప్టెంబర్‌ 27 నుంచి వీటి విక్రయాలు ప్రారభం కానున్నాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌తో పాటు కంపెనీ మెయిన్‌లైన్‌ స్టోర్‌లలో కొనుగోలు చేయొచ్చు. ఎస్‌బీఐ కస్టమర్లకు రూ.2వేల వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్ అందించనుంది. ఈ బ్యాంక్‌ కస్టమర్లకు రూ.15,999కే ఈ మొబైల్‌ లభిస్తుందన్నమాట.

Tags:    

Similar News