Honda CB750 Hornet : బైక్ ప్రియులకు గుడ్ న్యూస్.. హోండా CB750 హార్నెట్‌పై బంపర్ ఆఫర్.

Update: 2026-02-14 10:45 GMT

Honda CB750 Hornet : ప్రీమియం బైక్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హోండా CB750 హార్నెట్ ఇప్పుడు మరింత చౌకగా లభిస్తోంది. హోండా తన బిగ్‌వింగ్ డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా విక్రయించే ఈ బైక్ MY2025 స్టాక్‌పై రూ.1,00,000 వరకు నగదు తగ్గింపును ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుందని, స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే వర్తిస్తుందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. 2025 మోడల్ ఇయర్ స్టాక్‌ను క్లియర్ చేయడమే లక్ష్యంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ బైక్ మొదట భారత మార్కెట్లో లాంచ్ అయినప్పుడు ఎక్స్-షోరూమ్ ధర రూ.8.59 లక్షలుగా ఉండేది. ఆ తర్వాత జిఎస్‌టి (GST 2.0) నిబంధనల మార్పులతో ఈ ధర రూ.9.22 లక్షలకు చేరింది. ఇప్పుడు కంపెనీ ఇస్తున్న లక్ష రూపాయల డిస్కౌంట్‌తో ఈ బైక్ ఎఫెక్టివ్ ధర గణనీయంగా తగ్గింది. ప్రీమియం సెగ్మెంట్లో ఒక పవర్‌ఫుల్ బైక్ కోసం చూస్తున్న వారికి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. మీ సమీపంలోని హోండా బిగ్‌వింగ్ షోరూమ్‌ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

పర్ఫార్మెన్స్ విషయంలో ఈ బైక్ ఒక రాక్షసి అని చెప్పొచ్చు. ఇందులో 755cc ప్యారలల్-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ అమర్చారు. ఇది 9,500 rpm వద్ద 90.5 bhp పవర్, 7,250 rpm వద్ద 75 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్‌లో స్లిప్పర్ క్లచ్ ఫీచర్ కూడా ఉంది. దీనివల్ల వేగంగా గేర్లు మార్చేటప్పుడు బైక్ కంట్రోల్ తప్పకుండా ఉంటుంది. స్టీల్ డైమండ్ ఫ్రేమ్‌పై రూపొందించిన ఈ బైక్ బ్యాలెన్సింగ్ చాలా బాగుంటుంది.

కేవలం పవర్ మాత్రమే కాదు, ఫీచర్ల పరంగా కూడా హోండా హార్నెట్ టాప్ క్లాస్. ఇందులో 5-అంగుళాల TFT స్క్రీన్ ఉంది, దీనికి స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సౌకర్యం కూడా లభిస్తుంది. రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, రైడ్-బై-వైర్ థ్రాటిల్ వంటి ఆధునిక టెక్నాలజీ ఇందులో ఉంది. సేఫ్టీ కోసం ముందువైపు డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, వెనుక సింగిల్ డిస్క్ , డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్ ఫీచర్లుగా వస్తున్నాయి. ఫుల్ LED లైటింగ్ ఈ బైక్‌కు మరింత అగ్రెసివ్ లుక్ ఇస్తుంది.

Tags:    

Similar News