HYD: ట్రంప్ పన్ను దెబ్బ.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఢమాల్?

స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను విధించేందుకు ట్రంప్ సిద్ధం;

Update: 2025-05-17 02:00 GMT

అమెరికా అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా, అమెరికాలోని వలసదారులు స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను విధించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే హైదరాబాద్ సహా ఇతర నగరాల్లోని రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం చూపనుందని నిపుణుల అభిప్రాయం.

హైదరాబాద్‌ రియల్టీలో, ముఖ్యంగా మిడ్‌–హైఎండ్‌ రెసిడెన్షియల్‌ ప్రాజెక్టుల్లో ఎన్ఆర్ఐల పాత్ర కీలకం. అమెరికాలో స్థిరపడిన ఎన్నో కుటుంబాలు హైదరాబాద్‌లో ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేస్తూ వస్తున్నారు. వీరి పెట్టుబడులే కొంతవరకు మార్కెట్‌కు వన్నె తెస్తున్నాయి. అయితే, రెమిటెన్స్‌పై పన్ను విధిస్తే ఎన్‌ఆర్‌ఐలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడాన్ని పునర్విలీనంగా ఆలోచించే అవకాశం ఉంది.

ఇప్పటికే మాంద్యం బారిన పడిన హైదరాబాద్‌ రియల్టీకి ఇది మరో బలమైన దెబ్బగా మారే అవకాశముంది. ఈ చర్య 2025 జూలైలో అమలులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. కానీ అధికారికంగా అమెరికా ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ఇలా పన్ను భారం పెరిగితే హైదరాబాద్, అమరావతి వంటి నగరాల్లో ప్రాపర్టీ కొనుగోళ్లకు బ్రేక్ పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇది వాస్తవమైతే ఇన్వెస్టర్ల నమ్మకం కుంగిపోతుందని, స్థిరాస్తి ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News