TRUCKS: అదానీ మైనింగ్‌‌‌‌ కంపెనీలో హైడ్రోజన్ ట్రక్స్​

భారతదేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్-పవర్డ్ ట్రక్‌;

Update: 2025-05-12 07:30 GMT

ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లో జరుగుతున్న తన మైనింగ్ రవాణా అవసరాలను తీర్చేందుకు భారతదేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్-పవర్డ్ ట్రక్‌‌‌‌ను అదానీ గ్రూప్ రంగంలోకి దించింది. ఈ ట్రక్‌‌‌‌లో మూడు హైడ్రోజన్ ట్యాంక్‌‌‌‌లు ఉన్నాయి. 40 టన్నుల బరువును 200 కిలోమీటర్ల దూరం వరకు రవాణా చేయగలదని కంపెనీ వెల్లడించింది. అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్, గ్రీన్ రవాణా విధానాన్ని ప్రోత్సహించేందుకు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ట్రక్‌‌‌‌లను అదానీ గ్రూప్ కంపెనీ వాడాలని నిర్ణయించింది. 'లాజిస్టిక్స్ కార్యకలాపాల్లో ఉపయోగించే డీజిల్ వాహనాలను ఈ హైడ్రోజన్-పవర్డ్ ట్రక్‌‌‌‌లు క్రమంగా భర్తీ చేస్తాయి.' అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఒక ప్రముఖ ఆటో తయారీదారుతో కలిసి హైడ్రోజన్‌‌‌‌తో నడిచే ట్రక్‌‌‌‌లను అదానీ గ్రూప్‌‌‌‌ డెవలప్‌‌‌‌ చేస్తోంది. ఛత్తీస్‌‌‌‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయ్ రాయ్‌‌‌‌పూర్‌‌‌‌లో మొదటి ట్రక్‌‌‌‌ను జెండా ఊపి ప్రారంభించారు. దేశ విద్యుత్ డిమాండ్లను తీర్చడంలో ఛత్తీస్‌గఢ్ ముందంజలో ఉండటమే కాకుండా స్థిరమైన పద్ధతులను అవలంబించడంలో కూడా ఆదర్శంగా నిలుస్తుందని సీఎం తెలిపారు. ఈ ట్రక్ గరే పెల్మా 3 బ్లాక్ నుంచి రాష్ట్ర విద్యుత్ శాఖలకు బొగ్గును రవాణా చేసింది. గరే పెల్మా 3 బ్లాక్‌‌‌‌ను అదానీ గ్రూప్ డెవలప్ చేయడంతో పాటు ఆపరేట్ చేస్తోంది.

Tags:    

Similar News