Hyundai Creta : 10 నెలల్లో 1.70 లక్షలకు పైగా అమ్మకాలు..బ్రెజ్జా, నెక్సా అనుకుంటే పొరపాటే.

Update: 2025-11-28 11:50 GMT

Hyundai Creta : భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో చాలా పోటీ ఉన్నప్పటికీ ఒక మోడల్ మాత్రం నిలకడగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అదే హ్యుందాయ్ క్రెటా. 2025 సంవత్సరంలో మొదటి పది నెలల్లోనే క్రెటా తన ప్రజాదరణను కొత్త శిఖరాలకు చేర్చింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 2025 వరకు ఈ ఎస్‌యూవీని 1.70 లక్షలకు పైగా కస్టమర్‌లు కొనుగోలు చేశారు. ఈ సంఖ్య, ఈ విభాగంలో ఉన్న ఏ ఇతర ఎస్‌యూవీ అమ్మకాలతో పోలిస్తే చాలా ఎక్కువ. టాటా నెక్సాన్, మారుతి బ్రెజా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఉన్నప్పటికీ, క్రెటా అమ్మకాలలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

2025లో హ్యుందాయ్ క్రెటా నెలవారీ అమ్మకాలు చాలా స్థిరంగా, బలంగా ఉన్నాయి. ఈ పది నెలల్లో క్రెటా అమ్మకాలు మొత్తం 1,70,624 యూనిట్లుగా నమోదయ్యాయి. అంటే, ప్రతి నెలా సగటున దాదాపు 17,000 యూనిట్లు అమ్ముడవుతున్నాయి. అమ్మకాల గణాంకాలు (జనవరి-అక్టోబర్ 2025): జనవరిలో 18,522 యూనిట్లు, ఫిబ్రవరిలో 16,317, మార్చిలో 18,059, ఏప్రిల్‌లో 17,016, మేలో 14,860, జూన్‌లో 15,786, జూలైలో 16,898, ఆగస్టులో 15,924, సెప్టెంబర్‌లో 18,861, అక్టోబర్‌లో 18,381 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ఈ అమ్మకాల జోరు ఇలాగే కొనసాగితే నవంబర్, డిసెంబర్ నెలల్లో మంచి ఫలితాలు వస్తే, క్రెటా ఈ సంవత్సరం 2 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని కూడా సులభంగా అధిగమించే అవకాశం ఉంది. క్రెటా తన కస్టమర్‌లకు అనేక పవర్‌ట్రైన్ ఎంపికలను అందించడం వల్ల ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.10.73 లక్షల నుంచి మొదలవుతుంది.

ఇంజిన్ ఆప్షన్లు విషయానికి వస్తే.. 1.5-లీటర్ NA పెట్రోల్ ఇది 113 bhp పవర్ 144 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ టర్బో పెట్రోల్ 158 bhp పవర్ 253 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ డీజిల్ యూనిట్ ఇది 114 bhp పవర్ 250 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ (MT), CVT, 7-స్పీడ్ DCT, 6-స్పీడ్ ఆటోమేటిక్ (AT) వంటి వివిధ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటాను ఎప్పుడూ ఫీచర్ల విషయంలో బలంగా ఉండే ఎస్‌యూవీగా భావిస్తారు. ఇందులో 70 కంటే ఎక్కువ అధునాతన ఫీచర్లు, మరియు భద్రత కోసం లెవెల్-2 ADAS అందించారు. క్రెటా E, EX, S, S(O), SX, SX Tech, SX(O) వంటి అనేక వేరియంట్‌లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ E లో కూడా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మాన్యువల్ ఏసీ, యూఎస్‌బీ పోర్ట్, అన్ని పవర్ విండోలు, సెంట్రల్ లాకింగ్ మరియు ఫాబ్రిక్ సీట్లు వంటి ప్రాక్టికల్ ఫీచర్లు ఉంటాయి. దీని ప్రీమియం ఇంటీరియర్ లేఅవుట్, విశాలమైన స్పేస్ కస్టమర్‌లను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.

Tags:    

Similar News