Hyundai Exter : హ్యుందాయ్ ఎక్స్‌టర్‌పై భారీ డిస్కౌంట్.. రూ.6లక్షల లోపే మైక్రో ఎస్‌యూవీ మీ సొంతం.

Update: 2025-12-03 07:22 GMT

Hyundai Exter : ఈ డిసెంబర్‌లో కొత్త కారు కొనాలని చూస్తున్నారా? ముఖ్యంగా బడ్జెట్‌లో, ఎక్కువ ఫీచర్లు ఉన్న ఎస్‌యూవీ కోసం ఎదురుచూస్తున్నారా? ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తమ పాపులర్ మైక్రో ఎస్‌యూవీ ఎక్స్‌టర్ పై ఇయర్ ఎండ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ అద్భుతమైన డిస్కౌంట్‌తో ఏకంగా రూ.85,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. హ్యుందాయ్ ప్రకటించిన ఈ ఇయర్-ఎండ్ డిస్కౌంట్ కేవలం డిసెంబర్ నెలకు మాత్రమే పరిమితం. ఈ ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ ఇంకా ఇతర ప్రయోజనాలు కలిపి గరిష్ఠంగా రూ.5,000 వరకు లాభం పొందవచ్చు.

ఈ కారు కొనాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. అయితే, డీలర్‌షిప్ ఆధారంగా, మీరు ఎంచుకునే మోడల్ ఆధారంగా ఈ ఆఫర్‌లలో కొద్దిపాటి మార్పులు ఉండవచ్చు. కాబట్టి కారు కొనే ముందు మీ దగ్గరలోని హ్యుందాయ్ డీలర్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. మార్కెట్‌లో టాటా పంచ్ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తున్న ఎక్స్‌టర్, చాలా తక్కువ ధరలోనే అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.5.68 లక్షల నుంచి మొదలై, టాప్ మోడల్‌కు రూ.9.61 లక్షల వరకు ఉంటుంది. ఈ భారీ తగ్గింపు తర్వాత, ఇది మరింత తక్కువ ధరకే లభిస్తుంది.

ఃఈ కారులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 83bhp పవర్, 114Nm టార్క్ అందిస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో, హైవేపై కూడా చాలా స్మూతుగా పనిచేస్తుంది. పెట్రోల్ ధరలు పెరిగిన నేపథ్యంలో, ఎక్కువ మైలేజీ కోసం చూసే వారికి ఎక్స్‌టర్ సీఎన్‌జీ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇది చాలా డబ్బు ఆదా చేస్తుంది. ఎక్స్‌టర్ తన సెగ్మెంట్‌లో చాలా ఫుల్-లోడెడ్ కారుగా గుర్తింపు పొందింది. ఈ మైక్రో ఎస్‌యూవీలో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్, డ్రైవింగ్ సులభతరం చేసేందుకు క్రూజ్ కంట్రోల్, ఈ సెగ్మెంట్‌లో అరుదుగా కనిపించే సింగిల్-పాన్ సన్‌రూఫ్ ఉంటాయి.

భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్గా వస్తున్నాయి. ఇకా డిజిటల్ స్పీడోమీటర్ , రియర్ కెమెరా వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. తక్కువ ధరలో ఇంత మంచి ఫీచర్లు, సేఫ్టీ అందిస్తున్న హ్యుందాయ్ ఎక్స్‌టర్ భారత మార్కెట్లో ప్రధానంగా టాటా పంచ్ తో పాటు సిట్రోయెన్ సి3,మారుతి ఫ్రాంక్స్ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుంది.

Tags:    

Similar News