Hyundai i20 : కారు కొనాలనుకునే వారికి పండగే..హ్యుందాయ్ దెబ్బకు బాలెనో, ఆల్ట్రోజ్ పని ఖతం?

Update: 2026-02-06 08:45 GMT

Hyundai i20 : మధ్యతరగతి కారు ప్రియులకు హ్యుందాయ్ కంపెనీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తన పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు i20 ధరలను భారీగా తగ్గించింది. ఇప్పుడు కేవలం రూ.6.99 లక్షలకే సన్‌రూఫ్ ఫీచర్ ఉన్న మోడల్‌ను సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్ వంటి కార్ల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి హ్యుందాయ్ ఈ మాస్టర్ ప్లాన్ వేసింది. ధర తగ్గించినా కూడా ఫీచర్లు, సేఫ్టీ విషయంలో ఎక్కడా రాజీ పడకపోవడం విశేషం.

హ్యుందాయ్ i20 లో ఇప్పుడు Era వేరియంట్ బేస్ మోడల్‌గా నిలిచింది. దీని ప్రారంభ ధరను రూ.5.99 లక్షలకు (ఎక్స్-షోరూమ్) తగ్గించడంతో ఇది సామాన్యులకు మరింత చేరువయ్యింది. తక్కువ ధర కదా అని ఫీచర్లు తీసేశారనుకుంటే పొరపాటే. ఇందులో ఏకంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టైప్-సి USB ఛార్జర్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. అంటే తక్కువ బడ్జెట్ లోనే ప్రీమియం లుక్, అద్భుతమైన భద్రతను హ్యుందాయ్ అందిస్తోంది.

చాలామందికి కారులో సన్‌రూఫ్ ఉండాలని కోరిక ఉంటుంది. కానీ బడ్జెట్ అడ్డు వస్తుంటుంది. అలాంటి వారి కోసం హ్యుందాయ్ i20 మాగ్నా వేరియంట్‌ను రూ.6.99 లక్షలకే అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ తో పాటు ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, వెనుక ఏసీ వెంట్స్ వంటి విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. ఇక మాగ్నా ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ధర రూ.6.74 లక్షలుగా ఉంది. ఇందులో కీ-లెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉండటం విశేషం.

ఈ కారులో నమ్మకమైన 1.2 లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 83 bhp పవర్, 114.7 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మీరు మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సీవీటీ ఆటోమేటిక్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. మెరుగైన మైలేజీ కోసం ఇందులో ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జెనరేటర్‌ను కూడా అమర్చారు. కారు లోపల వినోదం కోసం మరో రూ.14,999 అదనంగా చెల్లిస్తే.. 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రియర్ కెమెరా వంటి ఫీచర్లను డీలర్ దగ్గర పొందవచ్చు.

హ్యుందాయ్ i20 ఎప్పుడూ తన స్టైల్, క్వాలిటీకి పేరుగాంచింది. ఇప్పుడు ధరలు తగ్గడం వల్ల ఇది వాల్యూ ఫర్ మనీ కారుగా మారింది. 3 ఏళ్లు లేదా 1,00,000 కిమీ వరకు స్టాండర్డ్ వారంటీ ఉండటంతో కొనుగోలుదారులకు భరోసా కలుగుతుంది. మీరు మంచి సేఫ్టీ, అద్భుతమైన ఫీచర్లు, తక్కువ ధరలో సన్‌రూఫ్ కారు కావాలనుకుంటే, i20 కంటే మంచి ఆప్షన్ ప్రస్తుతం మార్కెట్లో లేదని చెప్పవచ్చు.

Tags:    

Similar News