ప్రముఖ ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఇప్పటివరకు దేశంలోనే అతిపెద్ద ఐపీఓని ప్రారంభించబోతోంది. ఇందుకు సంబంధించి ఆటో కంపెనీ సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. ఇప్పుడు దానికి మార్కెట్ రెగ్యులేటర్ ఆమోదం లభించింది. ఐపీఓ ద్వారా భారతీయ స్టాక్ మార్కెట్ నుండి 3 బిలియన్ల డాలర్లకు (దాదాపు రూ. 25,000 కోట్లు) సమానమైన మొత్తాన్ని సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. ఇప్పటివరకు, భారతీయ ఐపీఓ మార్కెట్ చరిత్రలో ఎల్ఐసీ పేరు మీద రికార్డు ఉంది. ఎల్ఐసీ 2022 సంవత్సరంలో 2.7 బిలియన్ల డాలర్లకు సమీకరించడానికి ఐపీఓను ప్రారంభించింది. అయితే ఈ రికార్డు ఇప్పుడు బద్దలు కాబోతోంది. ఎందుకంటే హ్యుందాయ్ మోటార్స్ ఐపీఓతో వస్తోంది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దింతో అతి త్వరలో హ్యుందాయ్ ఐపీఓ ప్రారంభానికి మార్గం క్లియర్ చేసింది. ఇది వచ్చే నెల అక్టోబర్ 2024లో ఓపెన్ కానుంది.