Hyundai Venue vs Kia Syros : పోరు మామూలుగా లేదు.. 2025 హ్యుందాయ్ వెన్యూ VS కియా సిరోస్.. ఏ కారు బెటర్ ?

Update: 2025-11-17 06:00 GMT

Hyundai Venue vs Kia Syros : భారతదేశంలో సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో 2025 హ్యుందాయ్ వెన్యూ, కియా సిరోస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. హ్యుందాయ్ నవంబర్ 2025లో వెన్యూను లాంచ్ చేయగా, కియా ఫిబ్రవరి 2025లో సిరోస్‌ను మార్కెట్లోకి తెచ్చింది. రెండూ మోడ్రన్ డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో ఉన్నప్పటికీ కొనుగోలుదారులు దేన్ని ఎంచుకోవాలనే విషయంలో సందిగ్ధంలో ఉన్నారు. ఫీచర్లు, ఇంజన్, ధర పరంగా ఈ రెండు కార్లను పోల్చి చూద్దాం.

ధర, వేరియంట్స్

కొనుగోలుదారులకు ఎక్కువ ఆప్షన్లు, తక్కువ ధరలలో వెన్యూ అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ వెన్యూ ధర రూ.7.90 లక్షల నుంచి మొదలై రూ.15.69 లక్షల వరకు ఉంటుంది. వెన్యూలో N Line వంటి స్పోర్టీ మోడళ్లతో కలిపి మొత్తం 25 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.కియా సిరోస్ ప్రారంభ ధర రూ.8.67 లక్షలు కాగా, టాప్ మోడల్ ధర రూ.15.94 లక్షలు. సిరోస్‌లో మొత్తం 13 వేరియంట్లు మాత్రమే ఉన్నాయి. మీకు తక్కువ ధరలో, ఎక్కువ ఆప్షన్లు కావాలంటే, వెన్యూ సరైన ఆప్షన్. మీకు కొంచెం ఎక్కువ డబ్బు అయినా పర్వాలేదు ప్రీమియం ఫీల్ ముఖ్యం అనుకుంటే సిరోస్ బెటర్.

ఇంటీరియర్, స్పేస్

కేబిన్ స్పేస్, సౌకర్యం విషయంలో ఈ రెండు కార్ల మధ్య స్పష్టమైన తేడా ఉంది. హ్యుందాయ్ వెన్యూ ఇంటీరియర్ ఆధునికంగా ఉంటుంది. ఇందులో డ్యుయల్ 12.3-అంగుళాల స్క్రీన్లు, ఆంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే వెనుక సీటులో లెగ్ స్పేస్ మాత్రం సాధారణంగా ఉంటుంది. కియా సిరోస్ క్యాబిన్ మరింత విశాలంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో రియర్ వెంటిలేషన్, రిక్లైన్ సీట్లు, 64-కలర్ ఆంబియంట్ లైటింగ్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. మెరుగైన స్థలం, కుటుంబ సభ్యులకు వెనుక సీటు సౌకర్యం కావాలంటే సిరోస్ మెరుగైన ఎంపిక.

ఫ్యూచరిస్టిక్ ఫీల్ ఎవరిది?

సేఫ్టీ, అడ్వాన్సుడ్ ఫీచర్ల విషయంలో రెండూ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. రెండూ కూడా లెవల్-2 ADAS, పనోరమిక్ సన్‌రూఫ్, 360° కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి హై-ఎండ్ ఫీచర్లను అందిస్తున్నాయి. వెన్యూలో బోస్ 8-స్పీకర్ సిస్టమ్, OTA అప్‌డేట్స్, 4-వే పవర్డ్ డ్రైవర్ సీటు ఉంటుంది. సిరోస్‌లో 30-అంగుళాల పనోరమిక్ డిస్‌ప్లే, రియర్ వెంటిలేటెడ్ సీట్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్. ఈ ఫీచర్లు సిరోస్‌కు ఫ్యూచరిస్టిక్ లుక్‌ను ఇస్తాయి. రెండింటికి 5-స్టార్ రేటింగ్ ఉంది. రెండింటిలోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, TPMS వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

ఇంజన్, పర్ఫార్మెన్స్

హ్యుందాయ్ వెన్యూ 1.2L పెట్రోల్, 1.0L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్ అనే మూడు ఇంజన్ ఆప్షన్లను అందించి ఎక్కువ ఎంపికలను ఇస్తుంది. ముఖ్యంగా 1.0L టర్బో ఇంజన్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కియా సిరోస్ 1.0L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్ అనే రెండు ఇంజన్లతో వస్తుంది. సిరోస్ ఇంజన్లు ఎక్కువ స్మూత్‌గా, రిఫైన్‌మెంట్‌తో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ ఇంజన్ కాంబినేషన్లు కావాలంటే వెన్యూను ఎంచుకోవచ్చు. కానీ మెరుగైన డ్రైవింగ్ అనుభవం, రిఫైన్‌మెంట్ కావాలంటే సిరోస్ వైపు మొగ్గు చూపవచ్చు.

Tags:    

Similar News