Hyundai Verna : హోండా సిటీకి గట్టి పోటీ.. కొత్త లుక్‌లో రాబోతున్న హ్యుందాయ్ వెర్నా.

Update: 2025-12-16 07:15 GMT

Hyundai Verna : భారతదేశంలోని ప్యాసింజర్ వాహనాల మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్ కాకపోయినా హ్యుందాయ్ వెర్నా దేశీయ కార్లలో అత్యంత ఆకర్షణీయమైన వాటిలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ మోడల్ ముఖ్యంగా హోండా సిటీ వంటి కార్లకు గట్టి పోటీని ఇస్తుంది. ప్రస్తుతం హ్యుందాయ్, వెర్నా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌పై పని చేస్తోంది. త్వరలో రాబోయే 2026 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్లో ఎక్స్‌టీరియర్ డిజైన్, ఇంటీరియర్‌లో అనేక కొత్త అప్‌డేట్‌లు ఉంటాయని భావిస్తున్నారు. ఈ కొత్త మోడల్‌కు సంబంధించిన టెస్టింగ్ మోడల్‌ను విదేశాలలో చూసినట్లు మీడియా నివేదికలు తెలియజేస్తున్నాయి.

కొత్త హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ ముందు, వెనుక భాగాలలో ముఖ్యమైన మార్పులు ఉండవచ్చు. సెడాన్ ఫ్రంట్ లుక్ పూర్తిగా కొత్తగా, కొత్త రేడియేటర్ గ్రిల్, మరింత షార్ప్ బంపర్ డిజైన్తో మరింత ఆకర్షణీయంగా మారనుంది. LED హెడ్‌ల్యాంప్ క్లస్టర్ డిజైన్‌లో కూడా స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. అయితే స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ లేఅవుట్ మాత్రం అలాగే ఉండే అవకాశం ఉంది. బోనెట్ డిజైన్‌లో కూడా చిన్న మార్పులు ఉండవచ్చు. ఇంటీరియర్‌ విషయానికి వస్తే, క్యాబిన్ లోపలి డిజైన్ పూర్తిగా మార్చడానికి బదులుగా, ఇప్పటికే ఉన్న డ్యూయల్-స్క్రీన్ డాష్‌బోర్డ్ లేఅవుట్ను కొనసాగిస్తూనే, సౌకర్యం, లగ్జరీని పెంచేలా కొత్త ఫీచర్లను జోడించే అవకాశం ఉంది. కొత్త ట్రిమ్ ఫినిష్‌లు, వేరియంట్‌ల ఆధారంగా మార్చబడిన ఫీచర్ల జాబితా వినియోగదారులను ఆకర్షించేలా ఉంటుంది.

టెక్నికల్ గా 2026 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్ ఆప్షన్లలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ప్రస్తుత మోడల్‌లో ఉన్న 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కొత్త మోడల్‌లో కూడా కొనసాగే అవకాశం ఉంది. ట్రాన్స్‌మిషన్ కోసం మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మెకానికల్‌గా లేదా ఇంజిన్‌లో పెద్ద మార్పులు ఏవీ ఆశించనవసరం లేదు.

Tags:    

Similar News