ICICI Credit Card Rules : ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డ్‌ కొత్త రూల్స్‌

Update: 2024-10-14 05:15 GMT

ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ నియమాలలో గణనీయమైన మార్పులు చేసింది. వివిధ కార్డ్ కేటగిరీల్లో రివార్డ్ పాయింట్‌లు, లావాదేవీల రుసుములు, ప్రయోజనాల్లో ఈ మార్పులు ఉన్నాయి. కొత్త నవంబర్ 15 నుండి అమలులోకి వస్తాయి.బీమా, యుటిలిటీ బిల్లులు, ఇంధన సర్‌ఛార్జ్‌లు, కిరాణా కొనుగోళ్లపై ప్రయోజనాలను తగ్గించడమే కాకుండా విమానాశ్రయ లాంజ్‌లను ఉపయోగించడం కోసం ఖర్చు పరిమితిని కూడా ఐసీఐసీఐ బ్యాంక్ రెట్టింపు చేసింది. కొత్త మార్పుల గురించి తెలియజేస్తూ ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ కస్టమర్‌లకు మెసేజ్‌లు పంపింది.

కొత్త రూల్స్ ఇవే..

క్రెడిట్ కార్డ్ వినియోగానికి సంబంధించి బ్యాంక్ అనేక నిబంధనలను మార్చింది. క్రెడిట్ కార్డుల ద్వారా స్కూల్, కాలేజీ ఫీజులు చెల్లించే లావాదేవీల రుసుమును కూడా పెంచింది. కొత్త నిబంధనలు బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లన్నింటికీ వర్తిస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం, క్రెడ్‌, పేటీఎం, చెక్‌, మొబిక్విక్‌ వంటి థర్డ్-పార్టీ చెల్లింపు యాప్‌ల ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి పాఠశాల లేదా కళాశాల ఫీజులు చెల్లించినట్లయితే, 1 శాతం లావాదేవీ రుసుము వసూలు చేస్తారు. ఈ రుసుమును నివారించాలనుకుంటే నేరుగా పాఠశాల/కళాశాల వెబ్‌సైట్‌లో లేదా పీఓఎస్‌ మెషీన్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. బ్యాంక్ లావాదేవీల రుసుములను పెంచడమే కాకుండా అనేక ప్రయోజనాలను కూడా తొలగించింది. క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసిన యుటిలిటీ, బీమా చెల్లింపులపై లభించే రివార్డ్‌లను బ్యాంక్ తగ్గించింది. ప్రీమియం కార్డుదారులకు, రివార్డ్ పాయింట్ల పరిమితి నెలకు రూ. 80,000 కాగా, ఇతర కార్డుదారులకు ఈ పరిమితి రూ.40,000.

Tags:    

Similar News