కేంద్ర ప్రభుత్వం మరోసారి సామాన్య ప్రజలకు భారీ షాక్ ఇచ్చింది. మెడిసిన్ ట్యాబ్లెట్స్ ధరలను పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ డయాబెటిస్, బీపీ సహా 51 రకా ఔషధాల ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. ఎక్కువ మంది బీపీకి వినియోగించే టెల్మిసార్టన్, క్లోర్తాలిడోన్, సిల్నిడిపైన్ కలిపిన మాత్రలు రిటైల్ ధర ఒక్కో టాబ్లెట్ కు రూ.7.11గా నిర్ణయించారు.
సిప్రోఫ్లోక్సాసిన్ యాంటీ బాక్టీరియల్ ఇంజక్షన్ ధర మిల్లీలీటర్ (మి.లీ) కు రూ.0.23గా మోడీ సర్కార్ సవరించింది. అధికంగా వినియోగించే మెటా ఫార్మిన్, లినాగిస్టిన్, సిటాస్టిన్ రేట్లను ట్యాబ్లెట్ కు రూ.15 నుంచి రూ.20కు పెంచుతున్నట్లు సెంట్రల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
" యాంటీ బ్యాక్టీరియల్ ఇంజెక్షన్ సిప్రోఫ్లోక్సాసిన్, కాల్షియం, విటమిన్ డి3 పిల్స్ ధరలు సైతం భారీగా పెరిగాయి. ఇక, కొలెస్ట్రాల్ చికిత్స కోసం వినియోగించే అటోర్వాస్టాటిన్, ఆస్పిరిన్ కలిసిన క్యాప్సూల్స్ రిటైల్ రేట్లను కూడా పెంచబోతున్నట్టు సమాచారం.