Business: స్టాక్ మార్కెట్ కు రక్తకన్నీరు.. దాదాపు రూ.6 లక్షల కోట్లు ఢమాల్
Business: మార్కెట్లకు వరసగా రెండో సెషన్ కూడా భారీ నష్టాల సెషన్‌గా మారింది.;
Business: స్టాక్ మార్కెట్లో రక్తటేరు
సెన్సెక్స్ 1400, నిఫ్టీ 430 పాయింట్లకు పైగా నష్టం
హెవీ వెయిట్‌తో పాటు కుదేలైన స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్లు
ఇంట్రాడేలో దాదాపు ఆవిరైన రూ.6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద
7 కమోడిటీల ట్రేడింగ్‌ను ఏడాది పాటు నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు
ద్రవ్యోల్బణం పెరగడం, ఓమిక్రాన్ విజృంభణతో బలహీనపడిన సెంటిమెంట్
పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగిస్తోన్న ఎఫ్‌ఐఐలు
లాక్‌డౌన్ దిశగా పలు దేశాలు, ఇప్పటికే జనవరి 14వరకు లాక్‌డౌన్ విధించిన నెదర్లాండ్
ఒమిక్రాన్‌పై డబ్ల్యూహెచ్‌ఏ హెచ్చరికల నేపథ్యంలో క్రిస్‌మస్ తర్వాత లాక్‌డౌన్ దిశగా మరిన్ని దేశాలు?
బెంచ్‌మార్క్ లెండింగ్‌రేట్లను తగ్గించిన చైనా సెంట్రల్ బ్యాంక్
గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్ లేకపోవడంతో ప్రస్తుతం దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతోన్నాయి. ద్రవ్యోల్బణ భయాలు, ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో పాటు వరి, గోధుమ, శనగలు, ఆవాలు, సోయాబీన్స్, ముడి పామాయిల్, పెసర్ల కమోడిటీ ట్రేడింగ్‌ను ఏడాది పాటు నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడం మన మార్కెట్ల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతోపాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం కొనసాగించడం కూడా మన సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లోని అన్ని రంగాల సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనవుతోన్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో రక్తటేరు ప్రవహిస్తోంది. దీంతో దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బ్యాంకింగ్, ఆటో, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు నష్టాల మార్కెట్‌ను లీడ్ చేస్తున్నాయి. దీంతోపాటు బోర్డర్ ఇండిసెస్ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కూడా భారీ కరెక్షన్‌కు లోనవుతున్నాయి. ఈ సూచీలు దాదాపు 4శాతం నష్టంతో కొనసాగుతోన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1400 పాయింట్లు, నిఫ్టీ 430 పాయింట్ల నష్టంతో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ దాదాపు 4శాతం క్షీణించి 34 వేల 200 సమీపంలో కొనసాగుతోంది.
డే కనిష్ట స్థాయి నుంచి నిఫ్టీ దాదాపు 150 పాయింట్లు, సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లు కోలుకున్నప్పటికీ మార్కెట్లు ఇంకా నష్టాల్లోనే ట్రేడవుతోన్నాయి. హెవీ వెయిట్ స్టాక్స్‌తో పాటు స్మాల్, మీడియం స్టాక్స్ అన్నీ నష్టాల్లో కొనసాగుతోన్నాయి. టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌గా ఉన్నాయి. ఇక సిప్లాలో దూకుడు కొనసాగుతోంది. ఈ స్టాక్ దాదాపు 3శాతం నష్టంతో ట్రేడవుతోంది. మిగిలిన స్టాక్స్‌లో హెచ్‌యూఎల్, డాక్టర్ రెడ్డీస్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, విప్రోలు ఓ మోస్తారు లాభాల్లో ఉన్నాయి. బీపీసీఎల్ 6శాతం నష్టపోగా, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, హీరోమోటోకార్ప్‌లు దాదాపు 5శాతం నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.