Instagram New Feature: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై పీసీల్లో కూడా..
Instagram New Feature: టెక్నాలజీ రోజుకొక రకంగా రూపాంతరం చెందుతోంది.;
Instagram New Feature: టెక్నాలజీ రోజుకొక రకంగా రూపాంతరం చెందుతోంది. అది అలా మారుతూ ఉంటేనే టెక్నాలజీ లవర్స్ కూడా వాటిని ప్రోత్సహిస్తున్నారు. రోజుకు చాలామంది నిపుణులు ఎన్నో రకమైన యాప్స్‌ను కనిపెడుతున్నారు. కానీ అందులో కొన్ని మాత్రమే ప్రతీ ఒక్కరి దగ్గరికీ వెళ్లగలుగుతున్నాయి. వాట్సప్, ఇన్‌స్ట్రాగ్రామ్ లాంటి యాప్స్ అందరి ఫోన్‌లలోనే కాదు.. జీవితాల్లో కూడా భాగమయ్యాయి. తాజాగా తమ యాజర్లకు మరింత వెసులుబాటు కలిగిస్తూ ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది ఇన్‌స్ట్రాగ్రామ్.
ఇకపై కంప్యూటర్‌లలో కూడా ఇన్‌స్టాగ్రామ్‌ను యాప్‌లాగా ఉపయోగించవచ్చని యాప్ యాజమాన్యం తెలిపింది. ఇప్పటివరకు మన పీసీలలో ఇన్‌స్టాగ్రామ్‌ను కేవలం పోస్టులు చూడడం వరకే ఉపయోగించే సౌకర్యం ఉండేది. కానీ ఇకపై వెబ్ వెర్షన్ నుండి కూడా ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే అవకాశం కల్పించింది ఇన్‌స్టాగ్రామ్.
ముందుగా 'ఎన్‌గాడ్జెట్'లో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఈ ఫీచర్ మనం ఎక్కడ నుండి ఇన్‌స్టాగ్రామ్‌ను ఓపెన్ చేసిన అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా పర్సనల్ కంప్యూటర్‌లలో ఎడిట్ చేసుకున్న ఫొటోల్ని, హెజ్‌డీ ఇమేజ్‌లను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఇలాంటి ఫోటోలు అప్‌లోడ్ చేయాలంటే ముందుగా కంప్యూటర్ నుండి ఫోన్‌కు పంపించుకొని చేయాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేదు.
ఇంతకాలం ఫోన్‌లోనే ప్రతీ ఒక్కరి ఫీచర్‌ను అందించిన ఇన్‌స్టాగ్రామ్.. ఇప్పుడు కంప్యూటర్‌కు కూడా ఆ సౌలభ్యం అందిస్తోంది. ఈ ఫీచర్ వల్ల ఇన్‌స్టాగ్రామ్‌కు యూజర్లు కూడా పెరిగే అవకాశం ఉందని యాజమాన్యం అంచనా వేస్తోంది. మొత్తానికి ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పెడుతూ లైక్‌లు కొట్టేసే వాళ్లకి, ఎప్పటికప్పుడు ఫోటోలు పోస్ట్ చేస్తూ యాక్టివ్‌గా ఉండే యూజర్లకు ఉపయోగపడే ఫీచరే అనుకుంటున్నాయి టెక్ వర్గాలు.