iPhone 12: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డే సేల్‌లో ఐఫోన్ 12.. భారీ డిస్కౌంట్

iPhone 12: ఫ్లిప్‌కార్ట్ ఆన్‌గోయింగ్ బిగ్ సేవింగ్స్ డే సేల్‌లో ఐఫోన్ 12 ఆకర్షణీయ ధరలో అందుబాటులో ఉంది.

Update: 2022-07-25 11:45 GMT

iPhone 12: ఫ్లిప్‌కార్ట్ ఆన్‌గోయింగ్ బిగ్ సేవింగ్స్ డే సేల్‌లో ఐఫోన్ 12 ఆకర్షణీయ ధరలో అందుబాటులో ఉంది. జులై 27 వరకు కొనసాగే ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌లపై భారీ డిస్కౌంట్‌లు లభిస్తున్నాయి. కస్టమర్లు తమ డ్రీమ్ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు ఇదే సరైన సమయమని సంస్థ తెలిపింది.

ఐఫోన్ 13, ఐఫోన్ 12పై భారీ ఆఫర్లు, ఎక్సేంజ్ తర్వాత తగ్గింపు ధరలో హాట్ డివైజ్ లభిస్తోంది. డిస్కౌంట్ ఆఫర్‌లపై ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12 కేవలం రూ.33,999కి లభిస్తోంది. ఐఫోన్ 12 మూడు వేరియంట్లలో 64 జీబీ 128 జీబీ, 256 జీబీలలో లభిస్తుండగా వీటి ధరలు వరుసగా రూ.51,999, రూ.56,999, రూ. 74,999 కి సేల్‌లో లభ్యమవుతున్నాయి.

కొటక్ బ్యాంక్ ఆఫర్‌లో రూ.1000 తగ్గిస్తుండగా, ఎక్సేంజ్ ఆఫర్ కింద రూ.17000 వరకు అందించడంతో ఐఫోన్ 12 ధర మరింత తగ్గుతోంది. బ్యాంక్ డిస్కౌంట్, ఎక్సేంజ్ ఆఫర్‌తో కలిపి‌ ఐఫోన్ 12ను రూ.33,999కి సొంతం చేసుకోవచ్చు. ఇది 64 జీబీ వేరియంట్‌కు వర్తిస్తుండగా ఈ తరహా ఆఫర్లు 128 జీబీ స్టోరేజ్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 

Tags:    

Similar News