Tesla Model Y : సేఫ్టీలోనూ టాపర్ అనిపించుకున్న టెస్లా.. మోడల్ వై బుల్లెట్ ప్రూఫ్ లాంటిది.

Update: 2025-11-22 14:30 GMT

Tesla Model Y : ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఎలక్ట్రిక్ కార్ల తయారీలో టెస్లా మరోసారి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. తాజా యూరో NCAP క్రాష్ టెస్ట్ ఫలితాల్లో 2025 టెస్లా మోడల్ Y ఏకంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కైవసం చేసుకుంది. ఈ రేటింగ్‌తో మోడల్ Y తన సెగ్మెంట్‌లోని అత్యంత సురక్షితమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో ఒకటిగా నిలిచింది. ఇందులో ప్రయాణీకుల రక్షణ నుంచి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు వరకు ప్రతి అంశంలోనూ ఈ కారు అద్భుతమైన పనితీరును ప్రదర్శించింది.

యూరో NCAP పరీక్షించిన మోడల్ Y లెఫ్ట్-హ్యాండ్ డ్రైవ్, డ్యూయల్-మోటార్ AWD వెర్షన్. ఈ కారు భారత్‌లో నేరుగా విక్రయించబడకపోయినా దీని 5-స్టార్ రేటింగ్ రైట్-హ్యాండ్ డ్రైవ్ (భారత టాప్ వేరియంట్) మోడల్ Y లాంగ్ రేంజ్ RWDకి కూడా వర్తిస్తుంది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ టెస్ట్‌లో టెస్లా మోడల్ Y బాడీ షెల్ చాలా స్థిరంగా ఉన్నట్లు తేలింది. పెద్ద ప్రయాణీకులకు ఛాతి, తల, నడుము, కాళ్ల భద్రత గుడ్ నుంచి అడిక్వేట్ పరిధిలో నమోదైంది. సైడ్-ఇంపాక్ట్ టెస్ట్‌లో ఎస్‌యూవీ బలంగా నిలిచింది. అయినప్పటికీ సైడ్-పోల్ టెస్ట్‌లో ఛాతి రక్షణ మాత్రం మార్జినల్‎గా రేట్ చేయబడింది. అయినప్పటికీ మొత్తంగా మోడల్ Y క్యాబిన్ సేఫ్టీ చాలా ఆకట్టుకునే విధంగా ఉంది.

పిల్లల సేఫ్టీ విషయంలో టెస్లా మోడల్ Y అగ్రస్థానంలో నిలిచింది. 6, 10 సంవత్సరాల పిల్లల డమ్మీలపై చేసిన టెస్ట్‌లో యూరో NCAP 24/24 పరిపూర్ణ స్కోర్‌ను ఇచ్చింది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్, లేటరల్ ఇంపాక్ట్ (పక్క ప్రభావం) రెండు పరిస్థితులలోనూ పిల్లల తల, మెడ, ఛాతి, కాళ్ల భద్రత పక్కాగా ఉన్నట్లు కనుగొన్నారు. రియర్-ఫేసింగ్ చైల్డ్ సీట్‌ను సురక్షితంగా ఇన్‌స్టాల్ చేయడానికి ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌ను డిసేబుల్ చేసే అవకాశం ఉంది. ఈ ఎయిర్‌బ్యాగ్ స్థితి గురించి డ్రైవర్‌కు స్పష్టమైన హెచ్చరిక కూడా ఇస్తుంది.

సేఫ్టీ పరికరాల విషయంలో కూడా మోడల్ Y ముందుంది. ఇందులో లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB) సిస్టమ్ పాదచారులు, సైకిల్ మరియు మోటార్‌సైకిల్ రైడర్‌లను గుర్తించి, ఢీకొనే పరిస్థితిని నివారించడానికి లేదా నష్టాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకా ఇతర ఫీచర్ల విషయానికి వస్తే డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, లేన్ కీప్ అసిస్ట్, స్పీడ్ లిమిటర్, అన్ని సీట్లకు సీట్‌బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Tags:    

Similar News