Anant Ambani Watch : రూ. 13.7 కోట్ల వాచీలో అనంత అంబానీ అడవి..గడియారం లోపల సింహాలు, పులులు.

Update: 2026-01-23 05:00 GMT

Anant Ambani Watch : ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత అంబానీకి లగ్జరీ వాచీలు అంటే ఎంత ప్రాణమో అందరికీ తెలిసిందే. ఆయన దగ్గర ఉన్న వాచీల కలెక్షన్ చూసి ప్రపంచమే ముక్కున వేలేసుకుంటుంది. అయితే ఇప్పుడు ఆయన కోసం ప్రపంచ ప్రసిద్ధ గడియారాల తయారీ సంస్థ జాకబ్ అండ్ కంపెనీ ఒక కళ్లు చెదిరే అద్భుతాన్ని సృష్టించింది. కేవలం సమయాన్ని చూపడమే కాదు, ఒక అద్భుతమైన కథను చెప్పే ఈ వాచీ ఖరీదు అక్షరాలా రూ.13.7 కోట్లు. ఈ వాచీ లోపల ఏకంగా ఒక అడవిని, అందులో అనంత అంబానీ విగ్రహాన్ని రూపొందించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

గుజరాత్ లోని జామ్‌నగర్‌లో అనంత అంబానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వైల్డ్‌లైఫ్ రెస్క్యూ సెంటర్ వంటారా గురించి మనందరికీ తెలిసిందే. గాయపడిన, ఆపదలో ఉన్న వేల జంతువులకు ఇది పునరావాసం కల్పిస్తోంది. అనంత అంబానీకి జంతువుల పట్ల ఉన్న ఈ అపారమైన ప్రేమను గౌరవిస్తూ, జాకబ్ అండ్ కంపెనీ ఓపెరా వంటారా గ్రీన్ క్యామో పేరుతో ఒక ప్రత్యేక ఎడిషన్ వాచీని విడుదల చేసింది. ఈ వాచీ డిజైన్ చూస్తుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. గడియారం డయల్ లోపల ఒక చిన్నపాటి అడవిని సృష్టించారు.

ఈ వాచీ డయల్ మధ్యలో అనంత అంబానీ 3D సూక్ష్మ విగ్రహాన్ని చేతితో పెయింట్ చేసి అమర్చారు. ఆయన తన ఫేవరెట్ ఫ్లోరల్ షర్ట్ వేసుకుని ఉన్నట్లుగా ఆ విగ్రహాన్ని రూపొందించారు. కేవలం అంబానీ విగ్రహమే కాదు, ఆయన చుట్టూ అడవికి రాజు అయిన సింహం, బెంగాల్ టైగర్ లఘు విగ్రహాలను కూడా ఎంతో నైపుణ్యంతో చెక్కారు. వంటారా ఎకోసిస్టమ్ లో జంతువులు ఎంత క్షేమంగా ఉన్నాయో చెప్పడానికి ఈ డిజైన్ ఒక నిదర్శనం. జాకబ్ అండ్ కంపెనీ ఇలాంటి స్టోరీ టెల్లింగ్ వాచీలను తయారు చేయడంలో ప్రపంచంలోనే నంబర్ వన్ గా పేరుగాంచింది.

https://x.com/_Jacobandco/status/2014036773798855146?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^2014036773798855146|twgr^9479ae0dcb9586a200beb314e9ab26ee22d7b9b5|twcon^s1_&ref_url=https://www.tv9hindi.com/business/anant-ambani-jacob-and-co-vantara-watch-price-features-details-3658877.html

ఈ వాచీ తయారీలో వాడిన పదార్థాల గురించి వింటే దిమ్మతిరిగిపోతుంది. గడియారం కేసింగ్, డయల్ పై అడవిని తలపించేలా పచ్చని రంగులో క్యామోఫ్లాజ్ పాటర్న్ ఉంటుంది. ఈ డిజైన్ కోసం దాదాపు 400 విలువైన రత్నాలను (సుమారు 21.98 క్యారెట్లు) ఉపయోగించారు. వాచీ ఫ్రేమ్ మొత్తాన్ని ఖరీదైన వైట్ గోల్డ్ తో తయారు చేశారు. ఇక వాచీ బెల్ట్ విషయానికి వస్తే, దీనిని అసలైన ముసలి చర్మంతో రూపొందించారు. హై-ఎండ్ జ్యువెలరీ, ఇంజనీరింగ్ కలయికలో వచ్చిన ఈ వాచీని చూస్తే అది ఒక గడియారంలా కాకుండా ఒక గొప్ప కళాఖండంలా కనిపిస్తుంది.

ధర విషయానికి వస్తే, కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషకుల ప్రకారం దీని విలువ 15 లక్షల డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.13.7 కోట్లుగా ఉంటుందని అంచనా. జనవరి 21, 2026న ఈ వాచీని లాంచ్ చేశారు. గతంలో కూడా జాకబ్ అండ్ కంపెనీ భారతీయుల కోసం రామ జన్మభూమి ఎడిషన్ వాచీని తయారు చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు అంబానీ వారసుడి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ వంటారా వాచీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అంబానీ కుటుంబం చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఇది ఒక అంతర్జాతీయ గుర్తింపుగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.

Tags:    

Similar News