5జీ నెట్‌వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో రిలయన్స్ జియో నెంబర్ వన్‌గా అవతరించింది. 5జీ నెట్‌వర్క్ కవరేజ్‌లో మాత్రమే కాకుండా , లభ్యతలో కూడా జియో అద్భుతమైన పనితీరును ప్రదర్శిచింది. తాజాగా ఓపెన్ సిగ్నల్ విడుదల చేసిన నివేదికలో.. ఆంధ్రప్రదేశ్ టెలికామ్ సర్కిల్(ఆంధ్ర, తెలంగాణ) జియో అసాధారణమైన పనితీరును కనపరిచినట్లు వెల్లడించింది. ఓపెన్ సిగ్నల్ నివేదిక ప్రకారం.. జియో 5జీ కవరేజ్ టవర్లు 66.7 శాతం నెట్‌వర్క్ లభ్యత స్కోర్‌తో దాని ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉంది. దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లోని జియో వినియోగదారులు మూడింట రెండు వంతులు 5జీ సేవలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద విస్తృతమైన, స్థిరమైన 5జీ కనెక్టివిటీని అందించడంలో జియో ముందంజలో ఉందని నివేదిక స్పష్టం చేస్తోంది.