JioFinance : ఒక్క క్లిక్‌తో బ్యాంక్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్, స్టాక్స్.. జియోఫైనాన్స్ యాప్‌లో అద్భుతమైన ఫీచర్.
JioFinance : డబ్బును మేనేజ్ చేయడం, ఇన్వెస్ట్‌మెంట్లను ట్రాక్ చేయడం చాలా మందికి పెద్ద పని. కానీ ఇప్పుడు ఆ కష్టం ఉండదు. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌లోని జియోఫైనాన్స్ కంపెనీ తన యూజర్ల కోసం ఒక అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు మీ బ్యాంక్ అకౌంట్లు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ పోర్ట్‌ఫోలియోలు... ఇలా అన్నింటినీ వేర్వేరు యాప్‌లలో చూడాల్సిన అవసరం లేదు. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా, మీ మొత్తం ఆర్థిక జీవితం ఒకే స్క్రీన్‌పై కనిపిస్తుంది. కేవలం ఒక్క క్లిక్‌తో మీ డబ్బు ఎక్కడ ఉంది, ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎంత పొదుపు చేస్తున్నారో తెలుసుకోవచ్చు.
అన్నీ ఒకే చోట.. యూనిఫైడ్ డాష్‌బోర్డ్
జియోఫైనాన్స్ యాప్‌లో మొదటగా చేర్చిన ముఖ్యమైన ఫీచర్ యూనిఫైడ్ ఫైనాన్షియల్ డాష్‌బోర్డ్. ఈ డాష్‌బోర్డ్ ద్వారా జియోఫైనాన్స్ లోన్లు, డిపాజిట్లు, మీ ఇతర బ్యాంక్ ఖాతాల (చిన్న బ్యాంకు అయినా, పెద్ద బ్యాంకు అయినా సరే) వివరాలు అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. దీనివల్ల ఏ క్షణంలోనైనా మీ మొత్తం ఆదాయం, ఖర్చు, పొదుపు ఎంత ఉందో యూజర్‌కు రియల్ టైమ్‌లో అప్‌డేట్ అవుతూ ఉంటుంది.
పెట్టుబడుల లెక్కలు
రెండవ కీలకమైన ఫీచర్ కాంప్రహెన్సివ్ యాసెట్ ట్రాకింగ్. దీని ద్వారా మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ (స్టాక్స్), ఈటీఎఫ్స్, మీ బ్యాంక్ అకౌంట్లను లింక్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఈ సిస్టమ్‌తో మీ పెట్టుబడుల పనితీరు ఎలా ఉంది, ఏ ఫండ్‌లో లాభం వస్తోంది, ఎక్కడ మెరుగుపరుచుకోవాలి అనేది సులభంగా తెలుసుకోవచ్చు. త్వరలోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు వంటి వాటిని కూడా ఈ ట్రాకింగ్ సిస్టమ్‌తో జోడించబోతున్నామని కంపెనీ తెలిపింది.
AI తో స్మార్ట్ మేనేజ్‌మెంట్
ఈ రెండు ఫీచర్ల కంటే మరింత ప్రత్యేకమైనది, మూడవ ఫీచర్ అయిన స్మార్ట్, డేటా-డ్రివెన్ గైడెన్స్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను ఉపయోగిస్తుంది. ఈ ఏఐ ఫీచర్ యూజర్ ఖర్చు, ఆదాయం, ఇన్వెస్ట్‌మెంట్ విధానాన్ని అర్థం చేసుకుంటుంది. దాని ఆధారంగా "ఎంత పెట్టుబడి పెట్టాలి, ఏ ఖర్చు తగ్గించుకోవాలి, ఏ రంగంలో పొదుపు పెంచితే మంచిది" అనే విషయాలపై సరైన సలహాలు ఇస్తుంది. ముఖ్యంగా డబ్బును ఎలా మేనేజ్ చేయాలో తెలియని వారికి ఈ ఏఐ గైడెన్స్ చాలా ఉపయోగపడుతుంది.
ఉపయోగించడం చాలా సులువు
ఈ కొత్త ఫీచర్ భారతీయుల ఆర్థిక జీవితాన్ని మరింత సులభతరం చేస్తుంది. పారదర్శకంగా మారుస్తుంది అని కంపెనీ సీఈఓ సుర్భి ఎస్. శర్మ తెలిపారు. లక్షల మంది యూజర్లు ఈ యాప్ ద్వారా తమ డబ్బును మెరుగ్గా నిర్వహించుకోగలుగుతారు. ఆర్థికంగా బలపడతారు అనేది వారి నమ్మకం. జియోఫైనాన్స్ యాప్‌లో ట్రాక్ యువర్ ఫైనాన్సెస్ అనే ట్యాబ్‌లోకి వెళ్లి, కొన్ని సాధారణ స్టెప్స్ పూర్తి చేయడం ద్వారా యూజర్లు తమ పర్సనల్ ఫైనాన్షియల్ డాష్‌బోర్డ్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యాప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం, డీమ్యాట్ అకౌంట్ తెరవడం వంటి ఇతర ఆర్థిక సేవలను కూడా పొందవచ్చు.