దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ భారత్‌లో రెండు లగ్జరీ కార్లను విడుదల చేసింది. ఎలక్ట్రిక్ కారు ఈవీ9 ఎస్‌యూవీని మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.3 కోట్లుగా నిర్ణయించింది. ఇక ఇప్పటికే భారత మార్కెట్‌కు సుపరిచితమైన కియా కార్నివాల్ లగ్జరీ ఎంపీవీ సరికొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. పలు అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ కారు ధర రూ.63.90 లక్షలుగా నిర్ణయించింది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో దీనికి పోటీనే లేదు. కొత్త కార్నివాల్‌కు తాజాగా 24 గంటల్లోనే 1,822 బుకింగ్స్ రావడం విశేషం.