ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా నుంచి సరికొత్త మోడల్ కారు వస్తోంది. షెడ్యూల్ ప్రకారం.. లగ్జరీ మల్టీ-పర్పస్ వెహికల్ అక్టోబర్ 3న లాంచ్ కానుంది. కార్నివాల్ 2024 కోసం ప్రీ-లాంచ్ బుకింగ్‌లు సోమవారం(సెప్టెంబర్ 16) ప్రారంభమవుతాయని కియా ఇండియా ప్రకటించింది.ఈ కారు ఫుల్ బిల్ట్-అప్ (CBU) మోడల్‌గా భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోంది. కొత్త కియా కార్నివాల్‌లో వెంటిలేషన్, లెగ్ సపోర్ట్‌తో కూడిన రెండో వరుస లగ్జరీ పవర్డ్ రిలాక్సేషన్ సీట్లు, వన్-టచ్ స్మార్ట్ పవర్ స్లైడింగ్ డోర్, డ్యూయల్ సన్‌రూఫ్, 12-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్ పనోరమిక్ కర్వ్డ్ డిస్‌ప్లే 12.3-అంగుళాల సీసీఎన్‌సీ ఇన్ఫోటైన్‌మెంట్, 12.3 వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 23 అటానమస్ ఫీచర్‌లతో లెవెల్-2 అడాస్ కూడా ఉన్నాయి. కాగా, కనీస బుకింగ్ మొత్తం రూ. 2 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న కియా డీలర్‌షిప్‌లలో లేదా అధికారిక కియా వెబ్‌సైట్ ద్వారా వినియోగదారులు బుక్ చేసుకోవచ్చు.