Kia Seltos vs Tata Sierra 2026 : కియా సెల్టోస్ వర్సెస్ టాటా సియెర్రా..సెగ్మెంట్‌లో అసలైన కింగ్ ఎవరు?
Kia Seltos vs Tata Sierra 2026 : మిడ్-సైజ్ ఎస్‌యూవీ మార్కెట్లో ఇప్పుడు అసలైన సమరం మొదలైంది. ఒకవైపు అదిరిపోయే ఫీచర్లతో కొత్త కియా సెల్టోస్ దూసుకొస్తుంటే, మరోవైపు తన ఐకానిక్ లుక్, విశాలమైన క్యాబిన్‌తో టాటా సియెర్రా సవాల్ విసురుతోంది. ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏ కారులో ఏముంది? వివరంగా తెలుసుకుందాం.
కొలతలు మరియు స్పేస్: సైజు విషయంలో కియా సెల్టోస్ పొడవుగా ఉంటుంది (4,460 మిమీ). కానీ, టాటా సిక్రా వెడల్పు (1,841 మిమీ) మరియు ఎత్తు (1,715 మిమీ)లో సెల్టోస్‌ను మించిపోయింది. సిక్రా వీల్‌బేస్ (2,730 మిమీ) కూడా సెల్టోస్ కంటే కొంచెం ఎక్కువ, దీనివల్ల కారు లోపల కాలు పెట్టుకునేందుకు (Legroom) మరియు కూర్చునేందుకు ఎక్కువ స్థలం లభిస్తుంది. రోడ్ ప్రెజెన్స్ విషయంలో సిక్రా కొంచెం భారీగా కనిపిస్తుంది.
ఫీచర్ల జాతర: ఫీచర్ల విషయంలో రెండు కార్లు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి.
కియా సెల్టోస్: ఇందులో 30 అంగుళాల పనోరమిక్ డిస్‌ప్లే, లెవల్ 2 ADAS (21 ఫీచర్లతో), 8-స్పికర్ల బోస్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్ రూఫ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్ వంటి హైటెక్ ఫీచర్లు ఉన్నాయి.
టాటా సిక్రా: ఇందులో ట్రిపుల్ స్క్రీన్ సెటప్, 12-స్పికర్ల JBL సౌండ్ సిస్టమ్ (Dolby Atmos తో), 73 కనెక్టెడ్ కార్ ఫీచర్లు, పావర్డ్ టైల్‌గేట్, అదిరిపోయే పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. సిక్రాలో లభించే 19 అంగుళాల అలాయ్ వీల్స్ ఈ సెగ్మెంట్‌లోనే అతి పెద్దవి.
ఇంజన్, పెర్ఫార్మెన్స్: రెండు కార్లు కూడా పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో లభిస్తాయి.
సెల్టోస్: 1.5L పెట్రోల్ (115 hp), 1.5L టర్బో పెట్రోల్ (160 hp), 1.5L డీజిల్ (116 hp) ఇంజన్లతో వస్తుంది.
సియెర్రా: 1.5L రెవోట్రాన్ పెట్రోల్ (106 hp), 1.5L హైపీరియన్ టర్బో పెట్రోల్ (160 hp), 1.5L క్రయోజెట్ డీజిల్ (118 hp) ఇంజన్లు ఉన్నాయి. టర్బో ఇంజన్ల విషయంలో రెండూ సమవుజ్జీలుగా ఉన్నప్పటికీ, డీజిల్ టార్క్ విషయంలో సియెర్రా కొంచెం ముందంజలో ఉంది.
ధరల వివరాలు: బడ్జెట్ విషయానికి వస్తే, కియా సెల్టోస్ రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో కొంచెం చౌకగా ఉంది. టాప్ ఎండ్ మోడల్ ధర రూ.19.99 లక్షల వరకు ఉంటుంది. అదే టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలుగా ఉంది. టాప్ వేరియంట్ రూ. 21.29 లక్షల వరకు వెళ్తుంది. ప్రీమియం ఫీచర్లు, ఎక్కువ స్పేస్ కావాలనుకునే వారు సియెర్రా వైపు, టెక్నాలజీ, బ్రాండ్ వాల్యూ కోరుకునే వారు సెల్టోస్ వైపు మొగ్గు చూపుతున్నారు.