చమురు సంస్థలు వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. 19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.31 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1646కు చేరింది. ఇదే సమయంలో 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.చివరిసారిగా మార్చి 9న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.100 తగ్గించారు.
అంతకు ముందు ఆగస్టు 30న దేశవ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గింది. గత 10 నెలల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలో కేవలం రెండు మార్పులు మాత్రమే కనిపించాయి. ఈ క్రమంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.300 తగ్గింది. మార్చి 1, 2023న గృహోపకరణ గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. ఈ మార్పు కూడా జూలై 6, 2022 తర్వాత కనిపించింది. అంటే గత రెండేళ్లలో కేవలం నాలుగు సార్లు మాత్రమే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు వచ్చింది.