Mahindra 2026 : మహీంద్రా ఎస్‍యూవీల జాతర..2026లో రాబోతున్న 6 కొత్త కార్లు ఇవే.

Update: 2025-12-31 08:45 GMT

Mahindra 2026 : ఎస్‍యూవీ కార్ల తయారీలో రారాజుగా వెలుగొందుతున్న మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ 2025లో అదిరిపోయే హిట్స్ అందుకుంది. అదే ఊపును కొనసాగిస్తూ.. 2026లో భారతీయ రోడ్లపైకి 6 కొత్త మోడళ్లను వదిలేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. కొత్త టెక్నాలజీ, అదిరిపోయే డిజైన్లతో రాబోతున్న ఈ కార్లు మార్కెట్లో ప్రత్యర్థులకు నిద్రలేకుండా చేయడం ఖాయం.

మహీంద్రా నుంచి రాబోతున్న అత్యంత ఖరీదైన, లగ్జరీ కారు XUV 7XO. దీనిని జనవరి 5, 2026న అధికారికంగా ఆవిష్కరించనున్నారు. ఇది ప్రస్తుతం ఉన్న XUV 700కి అప్‌గ్రేడెడ్ వెర్షన్. లోపల డ్యాష్‌బోర్డ్ మొత్తం మూడు స్క్రీన్లతో నిండిపోయి ఉంటుంది. 16 స్పీకర్ల భారీ ఆడియో సిస్టమ్, 540-డిగ్రీల కెమెరా, లేటెస్ట్ ADAS వంటి ఫీచర్లతో ఇది ఒక లగ్జరీ నౌకలా ఉండబోతోంది. డిజైన్ పరంగా దీనిని XEV 9S మోడల్ స్పూర్తితో తయారు చేశారు.

మహీంద్రాకు వెన్నెముక వంటి థార్ రాక్స్, స్కోర్పియో ఎన్ మోడళ్లు 2026లో కొత్త రూపంలో రాబోతున్నాయి. ఐదు డోర్ల థార్ రాక్స్‌లో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక స్కోర్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ సరికొత్త డిజైన్, అప్‌డేటెడ్ ఫీచర్లతో రానుంది. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు యధావిధిగా కొనసాగుతాయి. రాబోయే పోటీని తట్టుకునేలా వీటిని మరింత బలంగా తీర్చిదిద్దుతున్నారు.

ఎలక్ట్రిక్ కార్ల రేసులో టాటాకు గట్టి పోటీ ఇచ్చేందుకు మహీంద్రా XUV 3XO EVని సిద్ధం చేస్తోంది. టాటా పంచ్ ఈవీకి గట్టి పోటీ ఇచ్చేలా దీనిని XUV 400 కంటే తక్కువ ధరకే తీసుకొస్తున్నారు. అలాగే అడ్వెంచర్ ఇష్టపడే వారి కోసం BE 6 Rall-E అనే పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ కారు కూడా రాబోతోంది. ఇది భారీ టైర్లు, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఆఫ్-రోడింగ్ చేసే వారికి మంచి అనుభూతిని ఇస్తుంది. ఇది మహీంద్రా సొంత INGLO ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించబడింది.

మహీంద్రా నుంచి రాబోతున్న మరో క్రేజీ మోడల్ విజన్ ఎస్. దీనిని స్కోర్పియో ఎన్ కాంపాక్ట్ వెర్షన్‌గా పిలుస్తున్నారు. 2025 ఆగస్టులో దీని కాన్సెప్ట్‌ను పరిచయం చేయగా, 2026 చివరి నాటికి ఇది రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. XUV 3XO లోని ఇంజిన్, గేర్‌బాక్స్‌ను దీనిలో వాడతారని సమాచారం. ఇవే కాకుండా మరిన్ని సరికొత్త మోడళ్లతో మహీంద్రా 2026లో ఎస్‍యూవీ మార్కెట్‌ను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది.

Tags:    

Similar News