Mahindra XEV 9S EV : మహీంద్రా నుంచి మరో ఎలక్ట్రిక్ కారు.. త్వరలో గ్లోబల్ డెబ్యూ.. అదిరే ఫీచర్లు.
Mahindra XEV 9S EV : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన మూడవ కంప్లీట్ ఎలక్ట్రిక్ SUV ని మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మహీంద్రా XEV 9S పేరుతో రాబోతున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ కారును కంపెనీ తన ప్రత్యేకమైన INGLO స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తోంది. ఈ కారు నవంబర్ 27, 2025న గ్లోబల్ డెబ్యూ కానుంది. దీని డిజైన్, ఫీచర్లు, రేంజ్ వివరాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.
మహీంద్రా త్వరలో తన XEV 9S ఎలక్ట్రిక్ SUV ని పరిచయం చేయనుంది. ఇది కంపెనీ XEV 7e మోడల్ ప్రొడక్షన్ వెర్షన్‌గా భావించబడుతోంది. లీకైన చిత్రాల ప్రకారం, ఈ కారులో XEV 9e మాదిరిగానే క్లోజ్డ్ గ్రిల్, ట్రయాంగిల్ హెడ్‌లైట్ డిజైన్ ఉంటుంది. అయితే, దీని L- ఆకారపు DRL లైట్, ఫ్రంట్ బంపర్ కొంచెం భిన్నంగా ఉంటాయి. దీని బాడీ షేప్, మొత్తం లుక్ ఎక్కువగా ప్రసిద్ధ XUV700 మాదిరిగానే ఉంటుంది. దీనికి కొత్త డిజైన్‌తో కూడిన ఏరో-ఫ్రెండ్లీ అల్లాయ్ వీల్స్‌ను ఇస్తారు.
ఈ SUV ని కంపెనీ లేటెస్ట్ INGLO స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తున్నారు. న్యూ జనరేషన్ మహీంద్రా EVలలో ఉండే విధంగా, XEV 9S లోపలి భాగం చాలా ఆధునికంగా, విలాసవంతంగా ఉంటుంది. దీని డ్యాష్‌బోర్డ్‌లో మూడు స్క్రీన్‌లతో కూడిన సెటప్ ఉంటుంది. అలాగే లైటింగ్ లోగోతో కూడిన టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, HUD (హెడ్-అప్ డిస్‌ప్లే), 16-స్పీకర్ల హార్మన్/కార్డన్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు లభించే అవకాశం ఉంది.
సేఫ్టీ విషయంలో ఇది లెవెల్ 2 ADAS సిస్టమ్‌తో పాటు, అనేక ఎయిర్‌బ్యాగ్‌లు, సేఫ్టీ ఫీచర్లతో రాబోతుంది. మహీంద్రా XEV 9S లో సీటింగ్, రేంజ్ విషయాల్లో XUV700 తరహాలో సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో కూడా XUV700 మాదిరిగానే మూడు వరుసల సీట్లు ఉండే అవకాశం ఉంది. రెండవ వరుసలో కెప్టెన్ సీట్ల ఆప్షన్‌ను కూడా కంపెనీ అందించవచ్చు. ఈ SUV లో 59kWh , 79kWh కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్‌లను అందించే అవకాశం ఉంది. వీటిని XEV 9e నుంచి తీసుకోవచ్చు. అధికారిక గణాంకాలు ఇంకా వెల్లడించనప్పటికీ ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇవ్వగలదని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి.
https://x.com/mahindraesuvs/status/1985263922551697625?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1985263922551697625|twgr^50e095a67051cb5672c5819a133d2ed0e9593b2e|twcon^s1_&ref_url=https://www.tv9hindi.com/automobile/mahindra-new-electric-car-will-be-equipped-with-these-great-features-launching-soon-3555811.html
మహీంద్రా XEV 9S గ్లోబల్ ఆవిష్కరణ తేదీ, మార్కెట్లోకి విడుదల అంచనాలు ఇలా ఉన్నాయి. మహీంద్రా XEV 9S ను నవంబర్ 27, 2025న ప్రపంచ వేదికపై ప్రదర్శించనుంది. దీనిని 2026 సంవత్సరం ప్రారంభంలో భారతీయ మార్కెట్‌లో విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది.