Mahindra XUV 7XO : ఇక కారు కింద ఏముందో కూడా చూసేయొచ్చు..540 డిగ్రీ కెమెరాతో గేమ్ ఛేంజర్ ఎంట్రీ.
Mahindra XUV 7XO : మహీంద్రా తన మోస్ట్ పవర్‌ఫుల్ ఎస్‌యూవీ XUV700ని సరికొత్తగా ముస్తాబు చేసి XUV 7XO పేరుతో మార్కెట్లోకి తెస్తోంది. జనవరి 5, 2026న గ్రాండ్‌గా లాంచ్ కానున్న ఈ కారుకు సంబంధించి కంపెనీ వరుసగా అదిరిపోయే టీజర్లను విడుదల చేస్తోంది. తాజా టీజర్‌లో 540 డిగ్రీల కెమెరా వంటి మైండ్ బ్లోయింగ్ ఫీచర్లను రివీల్ చేసింది. ఇప్పటికే డిసెంబర్ 15 నుంచి రూ.21,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.
సాధారణంగా లగ్జరీ కార్లలో 360 డిగ్రీ కెమెరాలు చూస్తుంటాం. కానీ మహీంద్రా ఒక అడుగు ముందుకు వేసి XUV 7XO లో 540 డిగ్రీల కెమెరా సెటప్‌ను ఇస్తోంది. ఇది కారు చుట్టూ ఉన్న పరిసరాలనే కాకుండా, కారు కింద రోడ్డు ఎలా ఉందో కూడా స్క్రీన్ మీద లైవ్ లో చూపిస్తుంది. ఆఫ్-రోడింగ్ చేసేటప్పుడు పెద్ద రాళ్లు ఉన్నా, లేదా రోడ్డు మీద గుంతలు ఉన్నా డ్రైవర్ ముందే జాగ్రత్త పడవచ్చు. ల్యాండ్ రోవర్ వంటి కోట్లు విలువ చేసే కార్లలో ఉండే ఈ ట్రాన్స్‌పరెంట్ బోనెట్ టెక్నాలజీ ఇప్పుడు మన మహీంద్రా కారులో రాబోతోంది.
కారు లోపల అడుగుపెడితే ఏదో స్పేస్ క్రాఫ్ట్‌లో కూర్చున్న అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఇందులో ఏకంగా మూడు డిజిటల్ స్క్రీన్లు ఉన్నాయి. డ్రైవర్ కోసం 10.25 ఇంచుల డిస్‌ప్లే ఉండగా, సెంటర్ లో, ప్యాసింజర్ సైడ్ చెరో 12.3 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్లు ఉన్నాయి. ఇవన్నీ లేటెస్ట్ Adrenox Plus AI ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి. ఇది పాత వెర్షన్ కంటే ఎంతో స్పీడ్‌గా, స్మార్ట్‌గా ఉంటుంది. ప్యాసింజర్ తన ముందున్న స్క్రీన్‌లో హాయిగా సినిమాలు చూసుకోవచ్చు లేదా మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు.
మహీంద్రా తన ఎలక్ట్రిక్ కారు XEV 9S లో ప్రవేశపెట్టిన BYOD (Bring Your Own Device) ఫీచర్‌ను ఇందులో కూడా ఇస్తోంది. అంటే వెనుక సీట్లో కూర్చున్న వారు తమ ట్యాబ్‌లు లేదా మొబైల్స్‌ను ఫిక్స్ చేసుకోవడానికి ప్రత్యేక హోల్డర్లు ఉంటాయి. అంతేకాదు మీ ల్యాప్‌టాప్ లేదా ఫోన్‌ను వేగంగా ఛార్జ్ చేసుకోవడానికి 65W టైప్-సి USB ఛార్జర్ కూడా ఉంటుంది. ఇది ముఖ్యంగా టాప్ ఎండ్ వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.
సేఫ్టీ విషయంలో రాజీ పడని మహీంద్రా, ఇందులో అప్‌డేటెడ్ లెవల్ 2 ADAS సూట్‌ను జోడించింది. లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేస్తాయి. వీటికి తోడు కారు ఇంటీరియర్ బ్రౌన్ టేన్ కలర్ థీమ్‌తో చాలా లగ్జరీగా కనిపిస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్, 16 స్పీకర్ల హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ ప్రయాణాన్ని మరింత గుర్తుండిపోయేలా చేస్తాయి.
ధర విషయానికొస్తే ఈ మోడల్ ప్రారంభ ధర దాదాపు రూ.15 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చని అంచనా. జనవరి 5న పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. టాటా హారియర్ ఈవీ, సఫారీలకు ఈ కారు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.