Mahindra XUV 7XO : మహీంద్రా XUV 7XO ప్రభంజనం.. మూడు స్క్రీన్లతో కారు కాదు.. ఇదొక నడిచే థియేటర్

Update: 2025-12-22 11:15 GMT

Mahindra XUV 7XO : మహీంద్రా తన పాపులర్ ఎస్‌యూవీ XUV700ని సరికొత్త హంగులతో మహీంద్రా XUV 7XO పేరుతో రీలాంచ్ చేసేందుకు సిద్ధమైంది. కేవలం పేరు మార్పు మాత్రమే కాదు, ఈ కొత్త మోడల్ డిజైన్, టెక్నాలజీ, ఫీచర్ల పరంగా భారీ అప్‌గ్రేడ్‌లను పొందింది. ఈ కారు కోసం ఎదురుచూసే వారు కేవలం రూ. 21,000 టోకెన్ అమౌంట్‌తో ఇప్పుడే బుకింగ్ చేసుకోవచ్చు. జనవరి 5, 2026న దీని ధరలను అధికారికంగా ప్రకటించనుండగా, అదే నెలలో డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి.

XUV 7XOలో రాబోతున్న ఆ టాప్-5 క్రేజీ అప్‌గ్రేడ్స్ ఇవే

1. అదిరిపోయే ట్రిపుల్ డాష్‌బోర్డ్ డిస్‌ప్లే

ఈ కారులో అతిపెద్ద మార్పు ఇంటీరియర్ అని చెప్పాలి. ఇందులో ఏకంగా మూడు 12.3-అంగుళాల హై-డెఫినిషన్ స్క్రీన్‌లు ఉండబోతున్నాయి. డ్రైవర్ కోసం డిజిటల్ క్లస్టర్, మధ్యలో ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్‌తో పాటు, ప్రక్కన కూర్చునే ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా ఒక టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఇందులో గేమ్స్ ఆడుకోవచ్చు, సినిమాలు చూడొచ్చు లేదా ఆన్‌లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్ ఈ సెగ్మెంట్‌లో ఇదే మొదటిసారి!

2. 19-అంగుళాల భారీ అలాయ్ వీల్స్

XUV 7XO రోడ్ ప్రెజెన్స్ పెంచేందుకు మహీంద్రా ఇందులో 19-అంగుళాల టూ-టోన్ అలాయ్ వీల్స్‌ను ఇస్తోంది. దీనివల్ల కారు చూడటానికి మరింత బలంగా, స్పోర్టీగా కనిపిస్తుంది. అలాగే రోడ్డుపై పట్టు కూడా మెరుగ్గా ఉంటుంది.

3. ఎలక్ట్రిక్ బాస్ మోడ్ సౌకర్యం

వెనుక సీటులో కూర్చునే వారికి రాజభోగం కల్పించేందుకు ఎలక్ట్రిక్ బాస్ మోడ్ ఫీచర్‌ను చేర్చారు. వెనుక కూర్చున్న ప్రయాణికులు ఒక బటన్ నొక్కడం ద్వారా ముందున్న కో-డ్రైవర్ సీటును ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేసి, కాళ్లు చాపుకోవడానికి అదనపు స్థలాన్ని పొందవచ్చు.

4. లగ్జరీ స్టీరింగ్ వీల్, ఇంటీరియర్

కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఈ కారుకు ప్రీమియం లుక్ ఇస్తుంది. దీనిపై వెలిగే మహీంద్రా లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. లోపల బీజ్, బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇంటీరియర్ థీమ్ కారుకు లగ్జరీ ఫీల్‌ను జోడిస్తుంది.

5. అడ్వాన్స్‌డ్ ఎక్స్‌టీరియర్, సేఫ్టీ

దీని ఫ్రంట్ డిజైన్ పూర్తిగా మారిపోయింది. కొత్త సి-షేప్డ్ ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, షార్ప్ బంపర్స్, వెనుక వైపు అదిరిపోయే హనీకోంబ్ పాటర్న్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉండబోతున్నాయి. సేఫ్టీ విషయంలో లెవల్-2 అడాస్ ఫీచర్లతో పాటు మరిన్ని సెన్సార్లను జోడించి దీనిని అత్యంత సురక్షితమైన కారుగా తీర్చిదిద్దారు.

Tags:    

Similar News