Mahindra : మహీంద్రా సునామీ ఆఫర్లు..రూ.4.45 లక్షలు తగ్గింపు..షోరూమ్‌లు ఖాళీ అవ్వాల్సిందే
Mahindra : కొత్త కారు కొనాలనుకునే వారికి దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. 2025 సంవత్సరం ముగింపు సందర్భంగా తన పాపులర్ ఎస్‌యూవీ మోడళ్లపై భారీ స్థాయిలో ఇయర్-ఎండ్ డిస్కౌంట్లను ప్రకటించింది. స్టాక్ క్లియరెన్స్ సేల్‌లో భాగంగా స్కార్పియో, థార్ రాక్స్, XUV700 వంటి కార్లపై ఏకంగా రూ.4.45 లక్షల వరకు లబ్ధి పొందే అవకాశాన్ని కల్పించింది. ఈ ఆఫర్లు కేవలం డిసెంబర్ 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.
మహీంద్రా కార్లలో ప్రస్తుతం అత్యధిక డిస్కౌంట్ లభిస్తోంది ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన XUV400 పైనే. దీనిపై గరిష్టంగా రూ.4.45లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి. ఇక ఫ్యామిలీ ఎస్‌యూవీగా పేరుగాంచిన XUV700 పై రూ. 1.55 లక్షల వరకు, స్కార్పియో క్లాసిక్ పై రూ. 1.40 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. ఇటీవల లాంచ్ అయ్యి మార్కెట్ను షేక్ చేస్తున్న థార్ రాక్స్ పై కూడా రూ. 1.20 లక్షల వరకు ఆఫర్లు ఉండటం గమనార్హం. కంపెనీ అత్యంత చౌకైన ఎస్‌యూవీ XUV 3XO పై రూ. 1.14 లక్షల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆఫర్లలో నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు, ఇన్సూరెన్స్ ప్రయోజనాలు కలిసి ఉంటాయి.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మహీంద్రా తన అత్యంత ప్రజాదరణ పొందిన స్కార్పియో ఎన్లో కొత్త అప్‌డేట్‌ను తీసుకురాబోతోంది. 2022లో లాంచ్ అయిన ఈ కారు ఇప్పటికీ భారీ వెయిటింగ్ పీరియడ్‌తో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు దీనికి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రాబోతోంది. ఇప్పటికే ఈ కొత్త మోడల్‌కు సంబంధించిన టెస్టింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2026 ప్రథమార్థంలో ఈ కొత్త స్కార్పియో ఎన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో బయటి డిజైన్ పెద్దగా మారకపోయినా, లోపల మరింత పెద్ద టచ్‌స్క్రీన్, అప్‌డేటెడ్ ఫీచర్లు మరియు లెవల్-2 అడాస్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
కొత్త మోడల్ రాకముందే పాత స్టాక్‌ను విక్రయించేందుకు మహీంద్రా ఈ డిస్కౌంట్లను ప్రకటించింది. అయితే ఈ ఆఫర్లు డీలర్‌షిప్, సిటీ, కారు మోడల్‌ను బట్టి మారుతుంటాయి. మీరు కూడా తక్కువ ధరలో మహీంద్రా ఎస్‌యూవీని ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే, ఈ నెలాఖరు లోపు మీకు దగ్గరలోని డీలర్‌ను సంప్రదించడం మంచిది. కొత్త ఏడాదిలో కార్ల ధరలు పెరిగే అవకాశం ఉండటంతో, ఇప్పుడే కొనుగోలు చేయడం లాభదాయకంగా ఉంటుంది.