Mahindra : భారతదేశంలో మహీంద్రా కంపెనీ కార్లకు ముఖ్యంగా వారి ఎస్‌యూవీ మోడల్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రేజ్‌ను మరింత పెంచడానికి మహీంద్రా కంపెనీ పెద్ద ప్లాన్ వేసింది. వచ్చే రెండు సంవత్సరాలలో, వివిధ సెగ్మెంట్లలో, కొత్త ఇంజిన్ ఆప్షన్స్‌తో సహా ఏకంగా 8 కొత్త ఎస్‌యూవీలను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే చాలా కార్లు టెస్టింగ్ దశలో ఉన్నాయని రిపోర్ట్స్ ద్వారా తెలిసింది.
మహీంద్రా మెగా ప్లాన్‌లో అత్యధిక దృష్టి ఎలక్ట్రిక్ వాహనాలపై ఉంది. అవి
BE Rall-E: ఇది BE 6 అడ్వెంచర్-ఫోకస్డ్ మోడల్‌గా రాబోతోంది. దీనికి మరింత పటిష్టమైన క్లాడింగ్, స్ట్రాంగ్ సస్పెన్షన్, రోడ్-బేస్డ్ వెర్షన్ కంటే అడ్వెంచర్ లుక్ ఉంటుంది. ఈ కారు వచ్చే ఏడాదిలోనే మార్కెట్‌లోకి రావచ్చు.
థార్ ఈవీ : ప్రస్తుతం ఉన్న థార్ మోడల్‌కు ప్రత్యామ్నాయంగా ఐదు డోర్లతో కూడిన జీరో-ఎమిషన్ ఆఫ్-రోడర్ థార్ ఈవీ కాన్సెప్ట్‌ను కంపెనీ ఇప్పటికే చూపించింది.
ఎలక్ట్రిక్ స్కార్పియో: దీనిపై కూడా అధ్యయనం జరుగుతోంది. ఒకవేళ ఇది మార్కెట్‌లోకి వస్తే, విజన్ ఎస్ కాన్సెప్ట్ నుంచి ఇన్‌స్పైర్ అయి బ్రాండ్ కొత్త NU_IQ ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉండే అవకాశం ఉంది.
XEV 9S : మహీంద్రా అత్యంత ముఖ్యమైన లాంచ్‌లలో ఇది ఒకటి. ఇది మూడు వరుసల ఎలక్ట్రిక్ కారు. ఈ కారు రెండు బ్యాటరీ ఆప్షన్స్‌తో రాబోతోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను ఇవ్వగలదు.
ఈవీలతో పాటు, ఇతర సెగ్మెంట్‌లలో కూడా మహీంద్రా కొత్త మోడల్స్‌ను తీసుకురాబోతోంది. విజన్ ఎక్స్ ఆధారిత చిన్న ఎస్‌యూవీ భవిష్యత్తులో చిన్న క్రాసోవర్‌గా రావచ్చు. XUV 3XO (గతంలో XUV300) ఆధారంగా రూపొందించిన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టెస్టింగ్ సమయంలో చాలాసార్లు కనిపించింది. మహీంద్రా నుంచి 2026 లో రాబోయే మొదటి ఎస్‌యూవీ XUV700 ఫేస్‌లిఫ్ట్ కావచ్చు. ఈ ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త బంపర్‌లు, అప్‌డేట్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు, కొత్త అల్లాయ్ వీల్స్‌తో పాటు, క్యాబిన్‌లో కూడా కొత్త లుక్ కనిపించే అవకాశం ఉంది. మొత్తంగా మహీంద్రా కంపెనీ తమ లైనప్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకుంది.