Maruti Fronx : మారుతి సుజుకి సొంత హైబ్రిడ్ టెక్నాలజీ.. మైలేజ్‌కు దీన్ని మించిందే లేదు..టయోటా కంటే చౌక.

Update: 2025-10-28 09:17 GMT

Maruti Fronx : మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు ఏప్రిల్ 2024 లో మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 ఎస్‌యూవీలలో స్థానం సంపాదించుకుంది. విడుదలైన మొదటి సంవత్సరంలోనే లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటిన ఈ కాంపాక్ట్ క్రాసోవర్ ఇప్పుడు మరిన్ని అద్భుతమైన అప్‌డేట్‌లకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా, మైలేజ్, సేఫ్టీని పెంచేందుకు మారుతి సుజుకి ఈ ఫ్రాంక్స్ కారుకు 2026 నాటికి స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్ తో పాటు ఏడీఏఎస్ సేఫ్టీ ఫీచర్ ను జోడించాలని ప్రణాళికలు వేస్తోంది.

మారుతి ఫ్రాంక్స్ కారు సక్సెస్ అయిన నేపథ్యంలో కంపెనీ 2026లో ఈ మోడల్‌కు రెండు ముఖ్యమైన అప్‌డేట్‌లను ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఏప్రిల్ 2024 లో విడుదలైన ఫ్రాంక్స్, తన స్టైలిష్ డిజైన్, ఫీచర్లు, సరసమైన ధర కారణంగా ఏడాదిలోనే లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటింది. రాబోయే 2026 నాటికి మారుతి సుజుకి ఈ కారుకు స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్, ఏడీఏఎస్ సేఫ్టీ ఫీచర్లను జోడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అప్‌డేట్‌ల ద్వారా కారు మైలేజ్, సేఫ్టీ రెండూ స్ట్రాంగ్ అవుతాయి.

మైలేజీ విషయంలో మారుతి సుజుకి తన పట్టును నిలబెట్టుకోవడానికి తన సొంత హైబ్రిడ్ టెక్నాలజీని రూపొందించింది. కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసిన హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ను పొందిన మొదటి మారుతి కారు ఫ్రాంక్స్ కానుంది. సుజుకి మోటార్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తున్న ఈ తరువాతి తరం 48V సూపర్ ఎనె-ఛార్జ్ హైబ్రిడ్ సిస్టమ్, ముఖ్యంగా లైట్ వెయిట్ కార్ల కోసం రూపొందించారు. ఇది టయోటా అట్కిన్సన్-సైకిల్ ఇంజిన్ కంటే మరింత చౌకగా ఉంటుందని చెబుతున్నారు.

ఫ్రాంక్స్ కారుకు రాబోయే ఈ హైబ్రిడ్ సిస్టమ్, త్వరలోనే మారుతి ఇతర ప్రధాన మోడళ్లకు కూడా విస్తరించనుంది. ఫ్రాంక్స్ హైబ్రిడ్ వేరియంట్‌లో 1.0 లీటర్ నుండి 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను హైబ్రిడ్ సిస్టమ్‌తో జత చేసే అవకాశం ఉంది. ఈ కొత్త హైబ్రిడ్ పవర్‌ట్రైన్ 2026లో కొత్త మారుతి బాలెనో, 2027లో కొత్త స్విఫ్ట్, 2029లో బ్రెజా కార్లలో కూడా ఉపయోగిస్తారని భావిస్తున్నారు.

అంతేకాకుండా, రెనాల్ట్ ట్రైబర్ వంటి వాటికి పోటీగా, జపాన్-స్పెక్ స్పాసియా ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడిన కొత్త సబ్-4 మీటర్ ఎంపీవీని కూడా మారుతి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఈ ఎంపీవీలో కూడా కంపెనీ స్వయంగా అభివృద్ధి చేసిన HEV (Hybrid Electric Vehicle) సిస్టమ్ ఉంటుంది.

Tags:    

Similar News