Maruti Suzuki : 30 రోజుల్లో 42,000లకు పైగా కార్లు ఎగుమతి.. హిస్టరీ క్రియేట్ చేసిన మారుతి సుజుకి.

Update: 2025-10-03 05:30 GMT

Maruti Suzuki : భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో అగ్రగామి సంస్థ అయిన మారుతి సుజుకి సెప్టెంబర్ 2025 అమ్మకాలతో చరిత్ర సృష్టించింది. ఈ నెలలో కంపెనీ తమ అత్యధిక ఎగుమతుల రికార్డును బద్దలు కొట్టి, ఏకంగా 42,204 కార్లను విదేశాలకు పంపింది. దేశీయ అమ్మకాలు కూడా పెరగడంతో, జీఎస్టీ 2.0 తగ్గింపు, నవరాత్రి పండుగ సీజన్ ప్రారంభం కంపెనీకి కలసి వచ్చి, మొత్తం అమ్మకాలలో 3 శాతం వృద్ధి నమోదైంది. మారుతి సుజుకి సంస్థ సెప్టెంబర్ 2025 నెల అమ్మకాల నివేదికను విడుదల చేసింది. ఈసారి మొత్తం అమ్మకాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే పెరిగింది. సెప్టెంబర్ 2025లో మారుతి ఎగుమతులతో కలిపి మొత్తం 1,89,665 యూనిట్లను విక్రయించింది

గతేడాది సెప్టెంబర్ 2024లో 1,84,727 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే, ఈసారి సుమారు 5,000 యూనిట్లు అదనంగా అమ్మి, 3 శాతం వార్షిక వృద్ధి సాధించింది. ఇందులో దేశీయంగా 1,35,711 యూనిట్లు విక్రయించబడ్డాయి. ఈ సెప్టెంబర్ నెల మారుతి చరిత్రలోనే అత్యంత కీలకమైనదిగా నిలిచింది. కంపెనీ ఏకంగా 42,204 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇది మారుతి సుజుకి నెలవారీ చరిత్రలో అత్యధిక ఎగుమతుల రికార్డు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో కేవలం 27,728 యూనిట్లు మాత్రమే ఎగుమతి అయ్యాయి. ఈసారి 51 శాతం అసాధారణ వృద్ధి నమోదైంది. అమ్మకాలు పెరగడానికి జీఎస్టీ 2.0 తగ్గింపు, పండుగ సీజన్ ప్రారంభం ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది.

నవరాత్రి పండుగ ప్రారంభమైన మొదటి 8 రోజుల్లోనే మారుతి సుజుకి ఏకంగా 1.65 లక్షల కార్లను కస్టమర్లకు డెలివరీ చేసింది. పండుగ సందర్భంగా వాహనాలను ఇంటికి తీసుకెళ్లాలనే వినియోగదారుల ఉత్సాహానికి ఈ డెలివరీలే నిదర్శనంగా చెప్పొచ్చు.

మారుతి సుజుకి వివిధ సెగ్మెంట్లలో విభిన్న పనితీరును కనబరిచింది. ఆల్టో, ఎస్-ప్రెస్సో, బాలెనో, సెలెరియో, డిజైర్, స్విఫ్ట్ వంటి మోడళ్లు బాగా అమ్ముడయ్యాయి. సెప్టెంబర్ 2025లో 74,090 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే (70,843 యూనిట్లు) ఈ సెగ్మెంట్‌లో గొప్ప వృద్ధి కనిపించింది. బ్రెజ్జా, ఇన్విక్టో, ఎర్టిగా, జిమ్నీ, విక్టోరిస్ వంటి మోడళ్లు ఈ కేటగిరీలో ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో 48,695 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గత సంవత్సరం (61,549 యూనిట్లు)తో పోలిస్తే ఈసారి స్వల్ప క్షీణత నమోదైంది. ఈకో వ్యాన్ అమ్మకాలు 10,035 యూనిట్లు, లైట్ కమర్షియల్ వెహికల్ సూపర్ క్యారీ అమ్మకాలు 2,891 యూనిట్లుగా ఉన్నాయి. ఈ రెండు విభాగాలలో కూడా గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు తగ్గాయి

Tags:    

Similar News