e Vitara : 500 కి.మీ పైగా రేంజ్, రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షర్..మారుతి నుంచి నయా కార్ రాబోతుంది.
e Vitara : భారత మార్కెట్‌లో తన ఎస్‌యూవీ రేంజ్‌ను విస్తరించడంలో దూకుడుగా ఉన్న మారుతి సుజుకి, ఇప్పుడు ఎలక్ట్రిక్ విభాగంలోకి ఒక భారీ ఎస్‌యూవీని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఆ మోడల్ పేరే మారుతి e Vitara. కంపెనీ ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎగుమతులను ప్రారంభించింది. తాజా సమాచారం ప్రకారం,.. ఈ మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని డిసెంబర్ 2025లో భారత మార్కెట్లో విక్రయానికి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌తో సహా ఇతర ప్రముఖ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
మారుతి సుజుకి ఇ విటారా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లతో వస్తుందని కంపెనీ ధృవీకరించింది. ఒకటి 49 kWh కాగా, మరొకటి 61 kWh బ్యాటరీ ప్యాక్. ఈ బ్యాటరీలలో BYD సంస్థ నుంచి తీసుకున్న LEFP బ్లేడ్ సెల్స్ ఉంటాయి. చిన్న బ్యాటరీ ప్యాక్‌తో 142 bhp మోటార్ లభిస్తుంది. పెద్ద 61 kWh బ్యాటరీతో కూడిన మోడల్ 172 bhp పవర్‌ను అందిస్తుంది. ఈ రెండు వెర్షన్లు కూడా 192.5 Nm టార్క్‌ను జనరేట్ చేస్తాయి. పెద్ద బ్యాటరీ వెర్షన్ 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
ఇ విటారా ఇంటీరియర్ ఆధునిక ఫీచర్లతో నిండి ఉంటుంది. ఇందులో 10.25-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.1-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆటో కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఇందులో లెవల్ 2 ADAS ఫీచర్లను చేర్చారు. దీంతో పాటు 7 ఎయిర్‌బ్యాగ్‌లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా లభిస్తాయి.
మారుతి ఇ విటారా మూడు వేరియంట్లలో లభించనుంది. దీనిని మారుతి ప్రీమియం డీలర్‌షిప్ నెట్‌వర్క్ అయిన నెక్సా ద్వారా విక్రయిస్తారు. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో దీనికి పోటీగా హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా బీఈ6, ఎంజీ జెడ్ఎస్ ఈవీ వంటి ప్రముఖ మోడల్స్ ఉన్నాయి. ఈ విభాగంలో మారుతి తొలిసారిగా భారీ రేంజ్ ఈవీని తీసుకురావడం వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్ కానుంది.