Maruti Suzuki E Vitara : మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ సునామీ.. నేడు లాంచ్ కాబోతున్న మారుతి ఈ విటారా
Maruti Suzuki E Vitara : భారతీయ మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లో అడుగుపెట్టేందుకు మారుతి సుజుకి సిద్ధమైంది. మారుతి సుజుకి నుంచి రానున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు E విటారా నేడు (డిసెంబర్ 2) వినియోగదారుల కోసం అధికారికంగా లాంచ్ కానుంది. ఈ ఎలక్ట్రిక్ SUVని కంపెనీ ఇప్పటికే ప్రదర్శించింది. కాబట్టి దీనిలో ఉండే అనేక ప్రత్యేక ఫీచర్లు లాంచ్‌కు ముందే దాదాపుగా ఖరారయ్యాయి. మారుతి నుంచి వస్తున్న మొదటి ఎలక్ట్రిక్ కారు కావడంతో, వినియోగదారులతో పాటు ఆటోమొబైల్ పరిశ్రమ కూడా ఈ లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
మారుతి సుజుకి E విటారా SUVలో అనేక ప్రీమియం ఫీచర్లను అందించింది. ఇందులో వినియోగదారులను ఆకర్షించే ఫిక్స్‌డ్ గ్లాస్‌తో కూడిన పనోరమిక్ సన్‌రూఫ్ ఉంది. ఇది SUVకి లగ్జరీ లుక్‌ను ఇస్తుంది. డ్రైవింగ్ అనుభవాన్ని సౌకర్యవంతంగా మార్చడానికి, ముందు భాగంలో వెంటిలేటెడ్ సీట్లు ఉంటాయి. అంతేకాకుండా, 10-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, అనుకూలమైన బూట్ స్పేస్, వెనుక సీట్లలో స్లైడింగ్, రిక్లైనింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. కస్టమర్ల సౌలభ్యం కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ SUV 61kWh బ్యాటరీతో ప్యాక్ చేయబడింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలిగే సామర్థ్యం ఈ కారు సొంతం.
సేఫ్టీ విషయంలో E విటారా ఎక్కడా రాజీ పడలేదు. ఈ కారులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అదనంగా డ్రైవర్ Knee ఎయిర్‌బ్యాగ్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు, Level 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్)ను కూడా అందించింది. ఇందులో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, హై బీమ్ అసిస్ట్ వంటి 15 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ADAS టెక్నాలజీ ఈ కారుకు ప్రీమియం భద్రతను జోడిస్తుంది.
కార్‌దేఖో నివేదిక ప్రకారం.. మారుతి సుజుకి E విటారా ప్రారంభ ధర రూ.17 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ధరల శ్రేణిలో కనుక ఈ SUV మార్కెట్‌లోకి వస్తే ఇది నేరుగా టాటా కర్వ్ EV, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, MG విండ్‌సర్ EV, మహీంద్రా BE 6 వంటి పవర్ఫుల్ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. మారుతి బ్రాండ్ విలువ, బలమైన ఫీచర్లు, 500 కి.మీ.ల రేంజ్ కారణంగా E విటారా ఎలక్ట్రిక్ SUV విభాగంలో గేమ్‌చేంజర్‌గా నిలవచ్చని అంచనా వేస్తున్నారు.