MG ZS EV Offer : 461 కి.మీ. రేంజ్..ఈ ఎలక్ట్రిక్ కారుపై రూ.1.25లక్షల బంపర్ డిస్కౌంట్.

Update: 2025-12-08 11:45 GMT

MG ZS EV Offer : ఆటోమొబైల్ కంపెనీలు ప్రతి నెలా వినియోగదారులను ఆకర్షించడానికి ప్రత్యేక ఆఫర్‌లను ప్రకటిస్తాయి. ప్రస్తుతం సంవత్సరం చివరి నెల డిసెంబర్ నడుస్తుండడంతో కంపెనీలు తమ 2025 స్టాక్‌ను క్లియర్ చేసి, 2026 కొత్త స్టాక్‌కు స్థలం ఇచ్చే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేసే వారికి ఇది మంచి అవకాశం. ఎంజీ మోటార్స్ తమ ప్రముఖ ఎలక్ట్రిక్ కారు ZS EVపై ఏకంగా రూ.1.25 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ తగ్గింపు ప్రయోజనాన్ని డిసెంబర్ 31, 2025 వరకు మాత్రమే పొందవచ్చు.

ఎంజీ ZS EV కారు ధర సాధారణంగా ఎక్స్-షోరూమ్ వద్ద రూ.17.99 లక్షల నుంచి మొదలవుతుంది. అయితే ఎంజీ మోటార్స్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన BaaS (Battery as a Service) ప్రోగ్రామ్ కింద ఈ కారును మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ స్కీమ్ ద్వారా కారును రూ.13 లక్షల ప్రారంభ ధరతో కొనుగోలు చేసే అవకాశం ఉంది. కానీ, ఈ తక్కువ ధర వద్ద కారు కొంటే, వినియోగదారుడు కారుకు బ్యాటరీ అద్దెను చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీ దీనికి ప్రతి కిలోమీటరుకు రూ.4.5 చార్జ్ చేస్తుంది. సాధారణ కొనుగోలుపై ప్రస్తుతం రూ.1.25 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది.

MG ZS EV కారు దాని అద్భుతమైన రేంజ్, అడ్వాన్సుడ్ ఫీచర్ల కారణంగా మార్కెట్లో గట్టి పోటీని ఇస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఒకే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 461 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. ఇందులో 50.3kWh సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు. వేగం విషయానికి వస్తే ఈ కారు కేవలం 8.5 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. సేఫ్టీ కోసం ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ADASకు చెందిన 17 అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు 75కు పైగా కనెక్టెడ్ ఫీచర్లు, డ్యూయల్ ప్యాన్ పనోరమిక్ సన్‌రూఫ్, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఇందులో ఉన్నాయి. భారతీయ మార్కెట్‌లో ఈ కారు టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా XUV 400 EV వంటి మోడళ్లకు ప్రధాన పోటీదారుగా ఉంది.

Tags:    

Similar News