Billionaires in India : భారత దేశంలో అత్యంత ధనవంతులు వీళ్లే.. రికార్డు క్రియేట్ చేసిన రోష్నీ నాడర్

Update: 2025-10-02 05:34 GMT

Billionaires in India : భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితా మళ్లీ విడుదలైంది. ఈసారి కూడా ముకేష్ అంబానీ మరోసారి నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. M3M ఇండియా, హురూన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా విడుదల చేసిన 14వ ఎడిషన్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ జాబితాలో ఒక ఆశ్చర్యకరమైన పేరు మూడవ స్థానంలో నిలిచింది. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితా బయటపడింది. ఈసారి కూడా ముకేష్ అంబానీ, ఆయన కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది. అయితే, ఈసారి ఒక ఆశ్చర్యకరమైన పేరు టాప్-3లో చోటు దక్కించుకుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ, ఆయన కుటుంబం 9.55 లక్షల కోట్ల రూపాయల నికర ఆస్తితో మరోసారి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం 8.15 లక్షల కోట్ల రూపాయల ఆస్తితో అంబానీ కుటుంబానికి దగ్గరగా రెండవ స్థానంలో నిలిచారు. ఈసారి జాబితాలో ఒక ఆశ్చర్యకరమైన పేరు మూడో స్థానంలో నిలిచింది. HCL టెక్నాలజీస్ అధినేత్రి రొష్ని నాడర్ మల్హోత్రా, ఆమె కుటుంబం 2.84 లక్షల కోట్ల రూపాయల ఆస్తితో టాప్-3లోకి ప్రవేశించింది. దీనితో రొష్ని నాడర్ భారతదేశంలోనే అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలిచింది.

* సైరస్ పూనావాలా కుటుంబం: 2.46 లక్షల కోట్ల రూపాయలు.

* కుమారమంగళం బిర్లా కుటుంబం: 2.32 లక్షల కోట్ల రూపాయలు.

* నీరజ్ బజాజ్ కుటుంబం: 2.32 లక్షల కోట్ల రూపాయలు.

* దిలీప్ సాంగ్వి: 2.30 లక్షల కోట్ల రూపాయలు.

* అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబం: 2.21 లక్షల కోట్ల రూపాయలు.

* గోపీచంద్ హిందూజా కుటుంబం: 1.85 లక్షల కోట్ల రూపాయలు.

* రాధాకిషన్ దమానీ కుటుంబం: 1.82 లక్షల కోట్ల రూపాయలు.

పతంజలి ఆయుర్వేద్ సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ రూ.43,640 కోట్ల ఆస్తితో 57వ స్థానంలో నిలిచారు. మేఘా ఇంజనీరింగ్ సంస్థకు చెందిన పి. పిచ్చి రెడ్డి, పి.వి. కృష్ణ రెడ్డిలు వరుసగా 60, 62వ స్థానాల్లో ఉన్నారు.

ఒక బిలియన్ డాలర్ల (సుమారు రూ.8,900 కోట్లు) కంటే ఎక్కువ ఆస్తి ఉన్న ధనవంతుల సంఖ్య భారతదేశంలో 350 దాటింది. 13 సంవత్సరాల క్రితం ఉన్న జాబితాతో పోలిస్తే, భారతీయ బిలియనీర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగింది. ఈ బిలియనీర్ల మొత్తం సంపద కలిపితే 167 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది.

పెర్ప్లెక్సిటీ అనే AI కంపెనీ వ్యవస్థాపకుడు అరవింద్ శ్రీనివాస్ రూ.21,190 కోట్ల ఆస్తితో భారతదేశంలో అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా నిలిచారు. ఆయన వయసు 31 సంవత్సరాలు. హురూన్ భారతీయ ధనవంతుల జాబితాలో స్థానం పొందిన అత్యంత పిన్న వయస్కులు జెప్టో వ్యవస్థాపకులైన కైవల్య వోహ్రా, ఆదిత్ పలిచ. వీరి వయసు వరుసగా 22, 23 సంవత్సరాలు.

భారతదేశంలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉన్న నగరం ముంబై. ఈ వాణిజ్య రాజధానిలో 451 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 223 మంది బిలియనీర్లు ఉన్నారు. ఐటీ నగరంగా, స్టార్టప్‌ల రాజధానిగా పేరుగాంచిన బెంగళూరులో 116 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. ఈ రెండు నగరాలు వరుసగా రెండవ, మూడవ స్థానాల్లో నిలిచాయి.

Tags:    

Similar News