Netflix: జియో పోస్ట్ పెయిడ్ యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ ..
Netflix: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఇండియా ప్లాన్‌లతో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ.. కానీ రిలయన్స్ జియో యూజర్‌లకు మాత్రం కేవలం పోస్ట్‌పెయిడ్ యూజర్లకు ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంది.;
Netflix: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఇండియా ప్లాన్‌లతో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ.. కానీ రిలయన్స్ జియో యూజర్‌లకు మాత్రం కేవలం పోస్ట్‌పెయిడ్ యూజర్లకు ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంది. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు జియో పోస్ట్ పెయిడ్ యూజర్‌లకు డిస్నీ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి ఇంతర ఓటీటీల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను జియో ఆఫర్ చేస్తోంది.
ఐదు జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. రూ.399, రూ.599, రూ.799, రూ.999, రూ.1499 విలువైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై జియో ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌లో డేటాతో పాటు, జియో టీవీ సహా పలు జియో యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.
ఆయా ప్లాన్స్‌తో పాటు ఫ్రీ నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైం సబ్‌స్క్రిప్షన్స్‌ను జియో ఆఫర్ చేస్తోంది. ఇక జియో ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో లేదు. జియో ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైం ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ చేస్తున్నా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ మాత్రం ప్రీపెయిడ్ ప్లాన్లతో జియో ఉచితంగా ఆఫర్ చేయడం లేదు.