New Car Launches : కొత్త కార్ల తుఫాన్.. 2025 చివరి నెలలో మార్కెట్‌ను ఊపేయనున్న మోడల్స్.

Update: 2025-12-06 07:30 GMT

New Car Launches : 2025 సంవత్సరంలో చివరి నెల అయిన డిసెంబర్ కూడా కొత్త కార్ల సందడితో నిండిపోనుంది. గత నెలల్లో మాదిరిగానే డిసెంబర్‌లో కూడా అనేక కొత్త మోడల్స్ భారత మార్కెట్‌లోకి ప్రవేశించబోతున్నాయి. వీటిలో మారుతి సుజుకి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ముఖ్యమైనది. అలాగే కియా కొత్త తరం కాంపాక్ట్ ఎస్‌యూవీ అంతర్జాతీయ మార్కెట్‌లో ఆవిష్కరణ కానుంది. దీంతో పాటు టాటా మోటార్స్ తమ రెండు పాపులర్ ఎస్‌యూవీలకు కొత్త పవర్‌ట్రైన్ ఆప్షన్‌ను జోడించనుంది. ఈ నెలలో లాంచ్ కాబోతున్న ముఖ్యమైన కార్ల ఇవే

టాటా హారియర్/సఫారీ పెట్రోల్

టాటా హారియర్, సఫారీ కార్లు భారతీయ లైనప్‌లో ఫ్లాగ్‌షిప్ ఐసీఈ (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) ఎస్‌యూవీలుగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఈ రెండు కార్లు కేవలం 2-లీటర్ డీజిల్ ఇంజిన్ (170 PS/350 Nm) ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే డిసెంబర్ 9న ఈ కార్లకు కొత్తగా 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (160 PS/255 Nm) ఆప్షన్‌ను జోడించబోతున్నారు. ఈ ఇంజిన్‌తో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు లభించే అవకాశం ఉంది. ఈ కొత్త పెట్రోల్ వేరియంట్ ధర, డీజిల్ వేరియంట్ ధర కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇదే ఇంజిన్‌ను ఇటీవల లాంచ్ అయిన 2025 టాటా సియెర్రాలో కూడా అందించారు.

మారుతి ఇ-విటారా

మారుతి సుజుకి సంస్థ భారతదేశంలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు అయిన ఇ-విటారాను పరిచయం చేయడానికి పూర్తిగా సిద్ధమైంది. ఈ ఎలక్ట్రిక్ కారు సుజుకి కొత్త డిజైన్ థీమ్‌తో రానుంది. ఇందులో LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, వై-షేప్ DRLలు, ర్యాప్‌అరౌండ్ LED టైల్‌లైట్లు, 18-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇ-విటారా ఎస్‌యూవీలో ఇంటిగ్రేటెడ్ స్క్రీన్ సెటప్ (10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, 10.1-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే)తో పాటు కొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్ ఉంటుంది.

ఫీచర్ల విషయానికి వస్తే ఫిక్స్‌డ్ గ్లాస్ రూఫ్, ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10-వే పవర్ డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్ 2 ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్) లభిస్తాయి. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది: 49 kWh (స్టాండర్డ్), 61 kWh (లాంగ్ రేంజ్). దీని రేంజ్ 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది.

న్యూ జనరేషన్ సెల్టోస్

కియా సంస్థ అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ సెల్టోస్ నెక్స్ట్-జెన్ మోడల్‌ను డిసెంబర్ 10, 2025న అంతర్జాతీయంగా ఆవిష్కరించబోతున్నారు. కొత్త తరం సెల్టోస్‌ను దక్షిణ కొరియాలో టెస్టింగ్ చేస్తున్నప్పుడు చాలాసార్లు కెమెరాకు చిక్కింది. ఈ కొత్త మోడల్ బాహ్య, అంతర్గత డిజైన్‌లో అనేక మార్పులు ఉంటాయి. ముఖ్యంగా దీని లేఅవుట్ కొంచెం బాక్సీగా, మరింత పటిష్టంగా ఉండవచ్చని స్పై షాట్స్ సూచిస్తున్నాయి

Tags:    

Similar News