New Kia Seltos 2026 : ఇది కారు కాదు, కొరియా సింహం..కొత్త కియా సెల్టోస్ 2026 ఎంట్రీ.

Update: 2025-12-10 14:00 GMT

New Kia Seltos 2026 : భారతీయ మార్కెట్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన కియా సెల్టోస్, ఇప్పుడు పూర్తిగా కొత్త అవతార్‌లో 2026 మోడల్‌గా విడుదలైంది. హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ వంటి ప్రముఖ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వడానికి కియా ఈ అప్‌డేట్‌తో వచ్చింది. ఈ కొత్త మోడల్ బుకింగ్‌లు ఈ రోజు (డిసెంబర్ 10, 2025) రాత్రి 12 గంటల నుంచి మొదలవుతాయి. బుకింగ్ అమౌంట్ రూ.25,000గా నిర్ణయించబడింది. అయితే కియా సంస్థ ఇప్పుడే ధరల వివరాలను ప్రకటించలేదు. జనవరి 2న ధరలన్నీ విడిగా వెల్లడిస్తామని కంపెనీ తెలిపింది. ఈ భారీ అప్‌డేట్‌తో కియా తన మార్కెట్ వాటాను మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కొత్త కియా సెల్టోస్ డిజైన్, అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న టెల్యూరైడ్ కారును పోలి ఉంటుంది. దీని డిజైన్ మునుపటి కంటే మరింత పెద్దదిగా, శక్తివంతంగా కనిపిస్తోంది. ముఖ్యంగా దీనిలో కొత్త అల్లాయ్ వీల్స్, గ్లోస్ బ్లాక్ టైగర్ నోస్ గ్రిల్, కొత్త LED డేటైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs), వెనుకవైపు సరికొత్త కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఈ కొత్త సెల్టోస్ HTE, HTK, HTX, GTX అనే నాలుగు ప్రధాన ట్రిమ్స్‌లో లభిస్తుంది. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ఫీచర్లు ఎంచుకోవడానికి వీలుగా కంపెనీ కన్వీనియన్స్, ప్రీమియం, ADAS, ఎక్స్-లైన్ డిజైన్ వంటి ఆప్షనల్ ప్యాకేజీలను కూడా అందిస్తోంది.

కొత్త సెల్టోస్‌లో కియా ఇంటీరియర్‌ను పూర్తిగా మార్చేసింది. కేబిన్ ఇప్పుడు మరింత మోడ్రన్ ఫీచర్లతో నిండిపోయింది. ఇందులో కొత్త ఫ్లోటింగ్ డ్యూయల్-స్క్రీన్ సెటప్ ఉంది. ఇందులో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ క్లస్టర్ రెండూ కలిసిపోయి ఉంటాయి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, డ్రైవర్ కోసం కొత్త స్టీరింగ్ వీల్ డిజైన్, హెడ్-అప్ డిస్‌ప్లే వంటివి ఇందులో ఉన్నాయి. లగ్జరీ ఫీచర్లలో యాంబియంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్-పెన్ పనోరమిక్ సన్‌రూఫ్ ముఖ్యమైనవి. అంతేకాకుండా వెనుక సీట్లను పూర్తిగా మడవవచ్చు, దీనివల్ల సామాను పెట్టుకునే స్థలం 447 లీటర్లకు పెరుగుతుంది.

కొత్త సెల్టోస్‌లో పాత ఇంజన్ ఆప్షన్లు కొనసాగుతున్నాయి.. కానీ కొత్త టర్బో పెట్రోల్ ఇంజన్ మరింత శక్తివంతమైనది.

1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్: 115 PS పవర్, 144 Nm టార్క్.

1.5 లీటర్ టర్బో పెట్రోల్: 160 PS పవర్, 253 Nm టార్క్ (ఇది అత్యంత శక్తివంతమైనది).

1.5 లీటర్ టర్బో డీజిల్: 116 PS పవర్, 250 Nm టార్క్. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో మాన్యువల్, iMT (క్లచ్ లేని మాన్యువల్), CVT ఆటోమేటిక్, టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ వంటివి ఉన్నాయి. ఈ కొత్త జనరేషన్ సెల్టోస్ 10 సింగిల్ టోన్ రంగులు, రెండు డ్యూయల్-టోన్ రంగుల (గ్లేసియర్ వైట్ పెర్ల్ + ఆరోరా బ్లాక్ పెర్ల్; మ్యాగ్మా రెడ్ + ఆరోరా బ్లాక్ పెర్ల్) ఆప్షన్లలో లభిస్తుంది.

Tags:    

Similar News