NIRMALA: రూపాయి పతనం ప్రయోజనమే 

నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు...బలంగా ఆర్థిక వ్యవస్థ మూలాలు... మార్కెట్ స్థీరీకరణకు ఆర్బీఐ సిద్ధం

Update: 2025-12-06 11:15 GMT

అమె­రి­కా డా­ల­ర్‌­తో పో­లి­స్తే రూ­పా­యి వి­లువ రి­కా­ర్డు స్థా­యి కని­ష్టా­ని­కి పడి­పో­యిన వి­ష­యం తె­లి­సిం­దే. డా­ల­ర్ తో రూ­పా­యి మా­ర­కం వి­లువ ప్ర­స్తు­తం 89.95గా ఉంది. రెం­డు రో­జుల క్రి­తం ఈ వి­లువ 90కి చే­రిం­ది. సమీప భవి­ష్య­త్తు­లో ఈ మా­ర­కం వి­లువ రూ.91కి చే­రు­తుం­ద­ని ఆర్థిక ని­పు­ణు­లు అం­చ­నా వే­స్తు­న్నా­రు. ఈ పరి­ణా­మాల నే­ప­థ్యం­లో కేం­ద్ర ఆర్థిక శాఖ మం­త్రి ని­ర్మ­లా సీ­తా­రా­మ­న్ కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. హిం­దు­స్థా­న్ టై­మ్స్ లీ­డ­ర్ షిప్ సద­స్సు­లో ఆమె మా­ట్లా­డు­తూ.. రూ­పా­యి పతనం పై మా­ట్లా­డా­రు. రూ­పా­యి వి­లువ పె­రి­గేం­దు­కు ప్ర­భు­త్వం తర­పున లేదా రి­జ­ర్వ్ బ్యాం­క్ ఆఫ్ ఇం­డి­యా తర­పున ప్ర­త్యే­కం­గా ఎలాం­టి లక్ష్యా­ల­ను ని­ర్దే­శిం­చ­లే­ద­ని ని­ర్మ­లా సీ­తా­రా­మ­న్ స్ప­ష్టం చే­శా­రు. రూ­పా­యి వి­లు­వ­ను కృ­త్రి­మం­గా ని­యం­త్రిం­చ­డా­ని­కి ప్ర­య­త్నిం­చ­డం సరి­కా­దు.. అం­త­ర్జా­తీయ మా­ర్కె­ట్లో ఏర్ప­డే డి­మాం­డ్, సర­ఫ­రా ఆధా­రం­గా­నే సరైన వి­లువ దొ­రు­కు­తుం­ద­ని ఆమె పే­ర్కొ­న్నా­రు. ఇదే క్ర­మం­లో రూ­పా­యి పతనం పూ­ర్తి­గా ప్ర­తి­కూ­ల­మే­మీ కా­ద­ని వె­ల్ల­డిం­చా­రు. ఈ క్ర­మం­లో బ్యాం­కు రు­ణా­లు ఉప­క­రి­స్తు­న్నా­య­ని చె­ప్పా­రు.

 ప్రయోజనకరమే 

ఈ పరి­స్థి­తు­లు ఎగు­మ­తి­దా­రు­ల­కు ప్ర­యో­జ­న­క­ర­మే­న­ని వె­ల్ల­డిం­చా­రు. రూ­పా­యి వి­లు­వ­లో అధిక హె­చ్చు­త­గ్గు­లు ఏర్ప­డి దేశ ఆర్థిక స్థి­ర­త్వా­ని­కి ము­ప్పు వా­టి­ల్లే ప్ర­మా­దం ఉన్న­ప్పు­డు, మా­ర్కె­ట్‌­ను స్థి­రీ­క­రిం­చేం­దు­కు మా­త్ర­మే ఆర్‌­బీఐ రం­గం­లో­కి ది­గు­తుం­ద­ని ని­ర్మ­లా సీ­తా­రా­మ­న్ వి­వ­రిం­చా­రు. ప్ర­పంచ వ్యా­ప్తం­గా అనేక ఆర్థిక వ్య­వ­స్థ­లు ద్ర­వ్యో­ల్బ­ణం, అధిక వడ్డీ రే­ట్ల­తో పో­రా­డు­తు­న్నా­య­ని, ఈ సమ­యం­లో అన్ని దే­శాల కరె­న్సీ­ల­పై­నా ఒత్తి­డి ఉం­ద­ని ఆమె చె­ప్పా­రు. ఈ గ్లో­బ­ల్ అని­శ్చి­తి భారత రూ­పా­యి­పై కూడా ప్ర­భా­వం చూ­పు­తు­న్న­ప్ప­టి­కీ.. ఇతర అభి­వృ­ద్ధి చెం­దిన, అభి­వృ­ద్ధి చెం­దు­తు­న్న దే­శాల కరె­న్సీ­ల­తో పో­లి­స్తే భారత రూ­పా­యి మె­రు­గ్గా, స్థి­రం­గా ఉం­ద­ని ని­ర్మ­లా సీ­తా­రా­మ­న్ అభి­ప్రా­య­ప­డ్డా­రు. రూ­పా­యి పత­నం­తో కు­టుం­బా­ల్లో పొ­దు­పు తగ్గు­తోం­ద­న్న ఆం­దో­ళ­న­ల­ను మం­త్రి తో­సి­పు­చ్చా­రు. పొ­దు­పు, పె­ట్టు­బ­డు­లు పె­రు­గు­తు­న్నా­య­ని వె­ల్ల­డిం­చా­రు. పొ­దు­పు మా­ర్గా­ల్లో మా­ర్పు­లు వస్తుం­డ­టం­తో అలా అని­పి­స్తుం­ద­ని, కానీ వా­స్త­వం­గా పొ­దు­పు తగ్గ­డం లే­ద­న్నా­రు. పైగా ఆస్తు­లు పె­రు­గు­తు­న్నా­య­ని తె­లి­పా­రు.

భారత్ తటస్థంగా లేదు 

హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి శక్తికాంత దాస్, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను మోదీ ప్రశంసిస్తూ, "మీ ఈ పర్యటన చాలా చరిత్రాత్మకమైనది. మీరు పదవీ బాధ్యతలు స్వీకరించి 25 సంవత్సరాలు అయింది, ఆ సమయంలోనే మొదటిసారి భారత్‌ను సందర్శించారు. మీ మొదటి పర్యటనలోనే మన వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాది పడింది. ఇది నాకు వ్యక్తిగతంగా కూడా చాలా ఆనందాన్ని కలిగించే విషయం. 2001లో మీరు పోషించిన పాత్ర, ఒక దార్శనిక నాయకుడు ఎలా ఆలోచిస్తాడో, ఆయన ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు, సంబంధాన్ని ఎంత దూరం తీసుకెళ్లగలరో చూపిస్తుంది. భారత్-రష్యా సంబంధాలు దీనికి ఉత్తమ ఉదాహరణ. యుక్రెయిన్ సంక్షోభంపై మోదీ మాట్లాడుతూ "యుక్రెయిన్ సంక్షోభం నుంచి మేం నిరంతరం చర్చలు జరుపుతున్నాం. మీరు కూడా, నిజమైన స్నేహితుడిలా ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని మాకు తెలియజేస్తున్నారు. ఈ నమ్మకం మన సంబంధానికి గొప్ప బలం. శాంతికి మార్గాన్ని కనుగొనడానికి మనందరం కలిసి పనిచేయాలి. ఇటీవలి కాలంలో జరుగుతున్న ప్రయత్నాలు ప్రపంచం మళ్లీ శాంతి వైపు తిరిగి వస్తుందనే పూర్తి విశ్వాసాన్ని నాకు ఇస్తున్నాయి. భారతదేశం తటస్థంగా లేదని నేను ప్రతీసారి చెబుతున్నాను. భారత్ ఒక వైఖరిని కలిగి ఉంది, అది శాంతి కోసం. శాంతి కోసం చేసే ప్రతి ప్రయత్నానికి మేం మద్దతు ఇస్తాం. భుజం భుజం కలిపి నిలబడతాం" అని మోదీ అన్నారు.

Tags:    

Similar News