Nissan Kait : క్రెటా, సెల్టోస్‌లకు పోటీ.. నిస్సాన్ కైట్ ఎస్‌యూవీ.. ఫస్ట్ లుక్ రిలీజ్.

Update: 2025-12-05 08:30 GMT

Nissan Kait : నిస్సాన్ నుంచి సరికొత్త కైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రెజిల్‌లోని సావో పాలోలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయబడింది. బ్రెజిల్‌లోని నిస్సాన్ రెసెంజ్ ప్లాంట్‌లో దీని ఉత్పత్తి ఇప్పటికే జరుగుతోంది. 2026 నుంచి ఈ మోడల్‌ను 20కి పైగా దేశాలకు ఎగుమతి చేయనున్నారు. లాటిన్ అమెరికాతో పాటు ఇతర మార్కెట్‌లలో ఈ కైట్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా, ఫియట్ పల్స్, రెనాల్ట్ కార్డియన్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రస్తుతానికి ఇది భారతదేశంలో ఎప్పుడు విడుదల అవుతుందనే దానిపై నిస్సాన్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

డిజైన్, సైజ్

నిస్సాన్ కైట్ ఆకర్షణీయమైన డిజైన్ హైలైట్స్‌తో వస్తుంది. ఇందులో LED హెడ్‌లైట్స్, డైనమిక్ LED DRLs, స్లాట్‌లతో కూడిన కొత్త గ్రిల్, వైడ్ ఎయిర్ ఇన్‌టేక్ వంటివి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో సర్క్యులర్ వీల్ ఆర్చెస్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌ను చూడవచ్చు. ఈ కారు 4.30 మీటర్ల పొడవు, 1.76 మీటర్ల వెడల్పు, 2.62 మీటర్ల వీల్‌బేస్‌ను కలిగి ఉంది. 432 లీటర్ల బూట్ స్పేస్ తో పాటు, ఇందులో అద్భుతమైన ఇంటీరియర్ స్పేస్ ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. నిస్సాన్ కైట్ మొత్తం నాలుగు ట్రిమ్స్‌లో (యాక్టివ్, సెన్స్ ప్లస్, అడ్వాన్స్ ప్లస్, ఎక్స్ క్లూజివ్) అందుబాటులో ఉంటుంది.

ఫీచర్స్, పవర్‌ట్రైన్ వివరాలు

నిస్సాన్ కైట్ ఫీచర్ల విషయంలో అస్సలు తగ్గలేదు. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ ఏసీ వంటివి ఉన్నాయి. సేఫ్టీ కోసం అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ADAS), 360-డిగ్రీ కెమెరా వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. పవర్‌ట్రైన్ విషయానికి వస్తే, కైట్ ఎస్‌యూవీలో కిక్స్ ప్లే మాదిరిగానే 1.6 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్, ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ ఇథనాల్‌తో 113 బీహెచ్‌పీ, పెట్రోల్‌తో 110 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సీవీటీ గేర్‌బాక్స్ (CVT Gearbox) తో వచ్చే ఈ కారు, సిటీలో లీటరుకు 11 కి.మీ మైలేజ్ ఇస్తుందని నిస్సాన్ తెలిపింది.

Tags:    

Similar News