Mukesh Ambani : రిలయన్స్ బోర్డులో ఉన్నా జీతాల్లేవ్
ముకేష్ అంబానీ పిల్లలకు శాలరీ వద్దు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక తీర్మానం;
రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఇషా, ఆకాశ్, అనంత్ అంబానీలకు ఎటువంటి జీతభత్యాలు ఉండవని ఆ సంస్థ వాటాదారులకు తెలియజేసింది. కంపెనీ బోర్డ్, కమిటీ మీటింగ్‌లకు హాజరైనందుకు మాత్రమే ఫీజు చెల్లిస్తామని పేర్కొంది. ఈ మేరకు ఇషా, ఆకాశ్, అనంత్ అంబానీలను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లోకి తీసుకునేందుకు ఆమోదం తెలపాలని కోరింది. గత నెలలో జరిగిన రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లోకి ఇషా, ఆకాశ్, అనంత్‌ను తీసుకోనున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. తన వ్యాపార బాధ్యతలను చూసుకునే వారిని తీర్చిదిద్దడం కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, సీఈఓగా మరో ఐదేళ్ల పాటు కొనసాగుతానని తెలిపారు. ఈ క్రమంలోనే వారిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లోకి తీసుకునేందుకు అనుమతి కోరుతూ రిలయన్స్ సంస్థ వాటాదారులకు బ్యాలెట్లను పంపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కూడా ముకేశ్ అంబానీ ఎటువంటి జీతభత్యాలను తీసుకోలేదు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఆ సంస్థ చీఫ్ ముఖేష్ అంబానీ పిల్లలు ఇషా అంబానీ, అనంత అంబానీ, ఆకాశ్ అంబానీ లకు స్థానం కల్పించడానికి షేర్ హోల్డర్ల అనుమతి కోరుతూ ఒక తీర్మానాన్ని సంస్థ మంగళవారం ఆమోదించింది. వారి అపాయింట్ మెంట్ కు షేర్ హోల్డర్ల అనుమతి కోరుతూ.. షేర్ హోల్డర్ల అందరికీ పోస్టల్ బ్యాలెట్ ను పంపించనున్నారు. సంస్థలో భవిష్యత్ తరం నాయకులను రూపొందించే దిశగా, సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసేవారుగా ఆ ముగ్గురిని బోర్డులోకి తీసుకుంటున్నట్లు సంస్థ తెలిపింది. ఈ విషయాన్ని నిజానికి గత నెలలో జరిగిన యాన్యువల్ జనరల్ మీటింగ్ లోనే వెల్లడించారు. ఇప్పుడు తాజాగా ఎందుకు సంబంధించిన నోటిఫికేషన్ ని షేర్ హోల్డర్స్ అనుమతి కోరుతూ విడుదల చేశారు. షేర్ హోల్డర్లందరికీ ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్ ని పంపిస్తున్నారు.
ముకేశ్ అంబానీ పిల్లల్లో ఆకాష్, ఈషా కవల పిల్లలు. వారి వయస్సు ప్రస్తుతం 31 సంవత్సరాలు. అనంత్ అంబానీ వయస్సు 28 సంవత్సరాలు. 2014లో ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరుగా చేరారు. ఆమెకు 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో రెండు కోట్ల రూపాయల కమిషన్, 6 లక్షల రూపాయల సిట్టింగ్ ఫీజు అందించారు. ప్రస్తుతం ముకేశ్ అంబానీ వయస్సు 66 సంవత్సరాలు.