NVIDIA : అత్యంత విలువైన సంస్థగా ఎన్‌విడియా

Update: 2024-10-26 10:45 GMT

ప్రపంచంలోనే విలువైన సంస్థగా ఉన్న యాపిల్‌ను తోసిరాజని NVIDIA ఈరోజు ఆ స్థానాన్ని దక్కించుకుంది. త్వరలో AI సూపర్ కంప్యూటింగ్ చిప్స్ తీసుకురానుందన్న వార్తలతో సంస్థ షేర్ విలువ గణనీయంగా పెరిగింది. ఎన్‌విడియా విలువ 3.53 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, యాపిల్ విలువ 3.52 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది. 6.6 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఓపెన్‌ఏఐ ప్రకటించిన అనంతరం NVIDIA విలువ ఈ నెలలో 18శాతం పెరిగింది.

ఎన్‌విడియా ఇప్పటికే హైదరాబాద్‌, బెంగళూరు, పుణె సహా భారత్‌లోని ఆరు ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ టెక్‌ దిగ్గజం పలు వ్యాపార సంస్థలు, క్లౌడ్‌ ప్రొవైడర్లు, స్టార్ట్‌పతో కలిసి.. వేలాది అత్యాధునిక జీపీయూలు, హై పెర్‌ఫార్మెన్స్‌ నెట్‌వర్కింగ్‌ అండ్‌ ఏఐ సాఫ్ట్‌వేర్‌ ప్లాట్‌ఫామ్స్‌ అండ్‌ టూల్స్‌తో కూడిన యాక్సిలరేటెడ్‌ కంప్యూటింగ్‌ స్టాక్‌ ద్వారా దేశంలో ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించనుంది. రిలయన్స్‌తో పాటు టాటా కమ్యూనికేషన్స్‌, హీరానందానీ గ్రూప్‌నకు చెందిన యోట్ట డేటా సర్వీసె్‌సతోనూ ఎన్‌విడియా డీల్‌ కుదుర్చుకుంది. ఈ రెండు కంపెనీల డేటా సెంటర్ల నిర్మాణం కోసం ఎన్‌విడియా హోపర్‌ ఏఐ చిప్‌లను సరఫరా చేయనుంది.

Tags:    

Similar News