ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ కీలక ప్రకటన చేశారు. షాప్ ఉన్న ఎవరైనా ఓలా ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్ ను అమ్మొచ్చని పేర్కొన్నారు. ప్రభుత్ వరంగ ఈ-కామర్స్ వేదిక ఓఎన్‌డీసీలో వచ్చేవారం నుంచి ఓలా ఎలక్ట్రిక్ ప్రొడక్టులు అందుబాటులోకి రానున్నాయని ప్రకటించిన ఆయన.. ఓలా స్కూటర్లను సైతం ఎవరైనా అమ్మొచ్చని పేర్కొన్నారు.‘ఓలాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 800 స్టోర్లు ఉన్నాయి. మరిన్ని కొత్త, ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు ప్రారంభించే బదులు ఎవరైనా ఓలా స్కూటర్లను అమ్మొచ్చు’అంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అంటే ఏదైనా గ్యారేజీలో ఇకపై ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విడి భాగాలను సులువుగా కొనుగోలు చేయడానికి వీలుపడుతుందని, తద్వారా ఏ గ్యారేజీలోనైనా ఓలా ఎలక్ట్రిక్ సర్వీసులు లభిస్తాయంటూ మరో పోస్టులో వివరించారు.