Ola Electric : ఐపీఓకు ఓలా ఎలక్ట్రిక్.. ఇన్వెస్ట్‌మెంట్‌కు కొత్త కేరాఫ్!
ఓలా ఎలక్ట్రిక్ పబ్లిక్ ఆఫర్ కు రానుంది. ఈ ఆఫర్ ద్వారా 5,500 కోట్లరూపాయలను సమీకరించనుంది. ఆగస్టు 2న ఓలా ఐపీఓ ప్రారంభం కానుంది. ఆగస్టు 6 వరకు అందుబాటులో ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్ ఈ ఆఫర్లో 37.9 మిలియన్ షేర్లను విక్రయించనుంది. ఓలాలో పెట్టుబడులు ఉన్న ఆల్ఫా వేవ్, ఆల్ఫాలైన్, డీఐజీ ఇన్వెమెంట్, మ్యాట్రిక్స్ తదితర సంస్థలు 47.89 మిలియన్ షేర్లు ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనున్నాయి.
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఓలా 5,009.8 కోట్ల రూపాయాల ఆదాయాన్ని నమోదు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 2,630.9 కోట్లుగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆదాయంలో భారీ పెరుగుదలకు ఓలా ఎస్1 ఎయిర్, ఎస్ 1 ఎక్స్ అమ్మకాలు i. భారీగా పెరగడమే కారణం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 3,29,618 ఓలా స్కూటర్లను విక్రయించింది.
ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో ఓలాకు 39 శాతం వాటా ఉంది. దేశంలో ఐపీఓకు వచ్చిన మొదటి స్టార్టప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ ఓలా సెబీ ఐపీఓకు నెల రోజుల క్రితమే అనుమతి ఇచ్చింది.