విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌షేర్లు మంగళవారం క్షీణించాయి. మూడు నెలల లాకిన్ పీరియడ్ నేటితో ముగిసిన నేపథ్యంలో ఒత్తిడికి గురయ్యాయి. దీంతో ఓలా షేర్లు ఏకంగా 7శాతానికి పైగా క్షీణించాయి. మధ్యాహ్నం 1 గంట సమయంలో కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో 7.08శాతం క్షీణించి రూ.75.08 వద్ద ట్రేడవుతున్నాయి. లాకిన్ పీరియడ్‌లో భాగంగా దాదాపు 18.2 కోట్ల విలువైన షేర్లను (182 మిలియన్ల) విక్రయించడానికి లేదు. ఇవి మొత్తం ఈక్విటీల్లో 4 శాతానికి సమానం. కంపెనీ ఐపీఓగా మార్కెట్లోకి రావడానికి ముందు ప్రమోటర్లు, యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరిస్తాయి. స్టాక్‌లలో ఆకస్మిక విక్రయాలు జరగకుండా ఉండేందుకు వీరికి కేటాయించిన షేర్లపై లాకిన్ పీరియడ్ విధిస్తాయి. అంటే మార్కెట్‌లో షేర్లు లిస్టయిన వెంటనే వీళ్లు తమ వాటాలను విక్రయించే అవకాశం ఉండదు. ఈ లాకిన్ పీరియడ్ గడువు ముగిసేంతవరకు ఓపెన్ మార్కెట్లో విక్రయించడానికి, ట్రేడ్ చేయడానికి కూడా వీలుండదు.