Patanjali Credit Cards : పతంజలి కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఇక నుంచి ప్రొడక్టులతో పాటు క్రెడిట్ కార్డులు కూడా.

Update: 2025-10-24 07:00 GMT

Patanjali Credit Cards : ప్రముఖ ఆయుర్వేదిక్, ఎఫ్‌ఎంసీజీ సంస్థ పతంజలి కేవలం ప్రొడక్టులకే పరిమితం కాకుండా, ఇప్పుడు తన కస్టమర్ల కోసం క్రెడిట్ కార్డుల సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. పతంజలి తన వినియోగదారులకు స్పెషల్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, రివార్డులను అందించేందుకు దేశంలోని రెండు పెద్ద బ్యాంకులైన పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్ లతో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టింది. డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహించడంతో పాటు, ప్రతి కొనుగోలుపై అదనపు లాభాలు అందించే ఈ కార్డుల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఆర్‌బీఎల్ బ్యాంక్ పతంజలి కస్టమర్ల కోసం రెండు రకాల క్రెడిట్ కార్డులను అందిస్తోంది. అవి గోల్డ్, ప్లాటినం కార్డులు. ఈ రెండు కార్డులు పతంజలి స్టోర్లలో షాపింగ్ చేసేవారికి గొప్ప ప్రయోజనాలను అందిస్తాయి.

పతంజలి గోల్డ్ క్రెడిట్ కార్డు: ఈ కార్డు ద్వారా పతంజలి స్టోర్లలో ప్రతి నెలా గరిష్టంగా రూ. 750 వరకు 10% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మొదటి ట్రాన్సాక్షన్ పై వెల్‌కమ్ రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. అదనంగా, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, హోటల్ బస, సినిమా టిక్కెట్లపై తగ్గింపులు వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

పతంజలి ప్లాటినం క్రెడిట్ కార్డు: ఈ కార్డుపై కూడా 10% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది, దీని లిమిట్ నెలకు రూ. 5,000 వరకు ఉంటుంది. ఈ కార్డుకు యాన్యువల్ ఫీజు ఉంటుంది. కానీ ఒక నిర్దిష్ట మొత్తంలో యాన్యువల్ గా ఖర్చు చేసినట్లయితే ఈ ఫీజు మాఫీ అవుతుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ – పతంజలి క్రెడిట్ కార్డులు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా పతంజలి భాగస్వామ్యంతో రూపే సెలెక్ట్, రూపే ప్లాటినం కార్డులను ప్రారంభించింది. ఈ కార్డులు పతంజలి స్టోర్స్‌తో పాటు ఇతర వ్యాపార సంస్థల వద్ద కూడా రివార్డ్‌లు, క్యాష్‌బ్యాక్ సౌకర్యాన్ని అందిస్తాయి. ఈ కార్డులు తీసుకున్న కస్టమర్లకు మొదటి లావాదేవీపై 300కు పైగా రివార్డ్ పాయింట్లు, సమగ్ర బీమా రక్షణ, 300 కంటే ఎక్కువ మర్చంట్ ఆఫర్ల ప్రయోజనం లభిస్తుంది. పతంజలి స్టోర్లలో రూ. 2,500 కంటే ఎక్కువ కొనుగోలు చేసినట్లయితే, కస్టమర్లకు 2% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

పతంజలి ఉత్పత్తులను తరచుగా కొనుగోలు చేసే కస్టమర్ల కోసం అదనపు ప్రయోజనం ఉంది. పతంజలి స్వదేశీ సమృద్ధి కార్డు ఉపయోగించే కస్టమర్లు, తమ పీఎన్‌బీ-పతంజలి క్రెడిట్ కార్డుతో రీఛార్జ్ లేదా ట్రాన్సాక్షన్లు చేసినప్పుడు 5-7% వరకు ఎక్స్ ట్రా క్యాష్‌బ్యాక్ పొందుతారు. దీని ద్వారా పతంజలి సాధారణ కస్టమర్‌లు ప్రతి కొనుగోలుపై మరింత ఎక్కువ ప్రయోజనం పొందడానికి వీలవుతుంది.

Tags:    

Similar News