Petrol and diesel Prices : మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..!

Petrol and diesel Prices : మరోసారి చమరు ధరలు పెరిగి వినియోగదారులకి షాకిచ్చాయి.. తాజాగా లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై 80 పైసల చొప్పున పెరిగాయి.

Update: 2022-03-26 02:00 GMT

Petrol and diesel Prices : పెట్రో ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ లీటరుకు 90 పైసలు పెరిగింది. ఈ వారంలో ధరలు పెరగడం ఇది నాలుగోసారి. దీంతో... హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటర్‌కు 111.79, డీజిల్‌ లీటర్‌కు 98.09 రూపాయలుగా రికార్డయింది.

ఈ ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపాయి చమురు కంపెనీలు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా... చమురు ధరలు పెంచలేదు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన 11 రోజుల్లోనే ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరచడం ప్రారంభించాయి.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ధరలు పెంచకపోవడంతో ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ కంపెనీలకు 19 వేలకోట్ల రూపాయల నష్టం వచ్చిందని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీసెస్‌ పేర్కొంది.

ఈ నష్టాలను పూడ్చాలంటే ధరలు పెంచక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. పెరుగుతున్న ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వాన్ని విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి.

Tags:    

Similar News