Indian Railways : రైల్వేకు రూ.554 కోట్ల ఆర్డర్.. 15% పెరిగిన షేరు ధర

Update: 2025-02-20 09:30 GMT

రైల్వే బోర్డు కర్ణాటక రైల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీ నుంచి రూ.554 కోట్లు విలువ చేసే ఆర్డర్ను పొందింది. ఇదే విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్ పేర్కొంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ స్టాక్ ను పోర్ట్ ఫోలియోకు యాడ్ చేసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. ఫలితంగా షేరు ధర భారీగా పెరిగింది. ఆర్వీఎన్ఎల్ ఇంట్రాడేలో 15శాతానికి పైగా ర్యాలీ చేశాయి. ఉదయం రూ.332 వద్ద ప్రారంభమైన షేరు ధర, ఒకానొక దశలో 15.6శాతం పెరిగి 384 స్థాయికి చేరుకుంది. అయితే మార్కెట్ ముగిసే సమయానికి 11.86శాతం వృద్ధితో 372.90 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.78,630 కోట్లకు పెరిగింది.

Tags:    

Similar News