విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ MPC సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తోంది. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది పదోసారి. అదేవిధంగా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును 6.25 శాతంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును 6.75 శాతంగా నిర్ణయించారు.