Realme C53: రియల్‌మీ కొత్త ఫోన్ C53 విడుదల నేడే..
ICICI, HDFC, SBI క్రెడిట్ కార్డులపై ఆఫర్లు ప్రకటిస్తూ, 6GB+64GB వేరియంట్‌పై 1000 తగ్గింపు ఉంటుందని తెలిపింది.;
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల సంస్థ రియల్‌మీ(Realme) బడ్జెట్ ధరల్లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. రియల్‌మీ సీ53(C53) పేరుతో కొత్త మోడల్‌ని జులై 19న లాంఛ్ చేయబోతుంది. అయితే ధర ఎంత అనేది ఇంకా వెల్లడించలేదు. మోడల్‌కి సంబంధించి ఆకర్షించే వివరాలను మాత్రం వెల్లడించింది. కానీ ఈ ఫోన్ అందుబాటు ధరల్లోనే ఉంటుందని అంచనా. జులై 19న మధ్యాహ్నం 12 గంటలకు దీనిని ఆవిష్కరించనున్నారు. ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద రేపు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్య సేల్‌కి ఉంచనున్నారు. ICICI, HDFC, SBI క్రెడిట్ కార్డులపై ఆఫర్లు ప్రకటిస్తూ, 6GB+64GB వేరియంట్‌పై 1000 తగ్గింపు ఉంటుందని తెలిపింది.
ఈ మోడల్ తీసుకువచ్చే సెగ్మెంట్‌లో దీనిలోనే నూతన ఫీచర్లతో తీసుకురానున్నారు. 108MP కెమెరాతో ఈ ఫోన్ రానుంది. ఈ విభాగంలో ఈ కెమెరాతో రావడం ఇదే మొదటి సారి. అలాగే 18వాట్(18W) ఫాస్ట్ ఛార్జింగ్‌తో 52 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ పూర్తి చేసుకుంటుంది. 5000mAh బ్యాటరీతో రానుంది. టచ్‌స్క్రీన్ 6.7 ఇంచెస్‌గా ఉండనున్నట్లు అంచనా.
ఈ సెగ్మెంట్‌లో స్లిమ్‌గా ఉండే ఫోన్ కూడా ఇదే అని వెల్లడించింది. దీని మందం కేవలం 7.99 మిల్లీమీటర్లు ఉంటూ ఆకర్షణీయంగా ఉండబోతుంది.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్(Flipkart)లో అందుబాటులో ఉండనుంది. అలాగే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచనున్నారు.